సెల్ఫీలు తీసుకున్న పిల్లి.. వైరల్ అవుతున్న ఫొటోలు..!

-

చాల మంది పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారు. కుక్కలు, పిల్లులు మనుషులతో అత్యంత సన్నిహితంగా మెలిగే పెంపుడు జంతువులు. అయితే జంతువులు మనం ఎలా నేర్పిస్తూ ఆలానే నేర్చుకుంటూ ఉంటాయి. అయితే చాల మంది జంతువులతో ఫోటోలు దిగుతుంటారు. అయితే ఓ పిల్లి తన యజమాని ఫోటోలు దిగడం ఇంతలో గమనించిందో తెలీదు కానీ.. స్వయంగా సెల్ఫీ తీసుకుంది ఈ బిల్లి. ఇంట్లో పెంపుడు జంతువులుంటే ఎక్కడ చూసినా దాని వెంట్రుకలు కనిపిస్తుంటాయి. అయితే, ఇటీవల ఒక మహిళ బయటనుంచి ఇంటికిరాగానే తన టాబ్లెట్‌పై తన పిల్లి వెంట్రుకలు కనిపించాయి. దీంతో దాన్ని ఓపెన్‌చేసి చూసి షాక్‌కు గురైంది. టాబ్లెట్‌లో పిల్లి సెల్ఫీ ఫొటోలు కనిపించాయని తెలిపింది. ఇప్పుడు ఇవి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌ అవుతున్నాయని తెలిపారు.

CAT-SELFIE
CAT-SELFIE

ఇక చైనాకు చెందిన మహిళ ఈ ఫొటోలను సామాజిక మీడియా ద్వారా షేర్‌ చేసింది. తన పెంపుడు పిల్లి ఎర్‌నియు సెల్పీలు తీసుకోవడం నేర్చుకుందని ఆమె చెప్పారు. ఇక ఫ్లాష్‌లైట్‌ను కూడా ఉపయోగిస్తోందని తెలియజేశారు. ఇక ఈ ఫొటోలకు భారీ స్పందన వచ్చిందని తెలిపారు. ఈ ఫోటోచుసిన నెటిజన్లు పిల్లి సెల్ఫీలు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇది స్మార్ట్‌ పిల్లి అంటూ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news