కరోనా లాక్‌డౌన్ సమయంలో క్షీణించిన జీఎస్టీ వసూళ్లు భారీగా పుంజుకున్నాయి. జనవరి నెలకు గానూ అత్యధికంగా దాదాపు 1.20 లక్షల కోట్లు వసూలయ్యాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత భారీ మొత్తంలో వసూలు కావడం ఇదే తొలిసారి. గతేడాది జనవరితో పోలిస్తే 8 శాతం అధికంగా ఆదాయం సమకూరిందని లెక్కలు చెబుతున్నాయి.
గతేడాది ఇదే నెలకు 1.11 లక్షల కోట్లు జీఎస్టీ కింద వసూలయ్యాయి. గత 4 నెలలుగా జీఎస్టీ వసూళ్ళ ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం క్రమేపీ పెరుగుతోందని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జనవరిలో జీఎస్టీ ద్వారా వచ్చిన ఆదాయం ఒక లక్ష 19 వేల 847 కోట్ల రూపాయలుగా ఉంది. గత సంవత్సరం ( 2020) జనవరిలో జీఎస్టీ ద్వారా వచ్చిన ఆదాయం కంటే, ఈ ఏడాది జనవరి నెల ( 2021) ఆదాయం 8 శాతం ఎక్కువన్న మాట.