ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియాలో పోస్టుల భర్తీ.. పూర్తీ వివరాలు..

ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు.అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులతో మూడేళ్ల బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఇన్‌ ఇంజనీరింగ్‌ ఏదైనా సెమిస్టర్‌లో ఫిజిక్స్‌మ్యాథమెటిక్స్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్‌లో రాయడం, మాట్లాడటంలో కనీసం నైపుణ్యం ఉండాలి.

అభ్యర్ధుల వయసు 27ఏళ్లు మించకుండా ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి ముందుగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఆన్‌లైన్‌ రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌,వాయిస్‌ టెస్ట్, బ్యాక్‌ గ్రౌండ్‌ వెరిఫికేషన్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఫైనల్ ఎంపిక ఉంటుంది..

దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. దరఖాస్తులకు చివరి తేది జులై 14,2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.aai.aero పరిశీలించగలరు. అభ్యర్ధులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చెయ్యగలరు..