ఎన్.టి.ఆర్ ‘అయినను పోయిరావలె అస్తినాకు’ కథ ఇదేనట ..!

-

మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ రేస్ లో ముందున్నారు. రీసెంట్‌గా అల్లు అర్జున్ పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన ‘అల వైకుంఠ పురములో’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. అయితే త్రివిక్రమ్ 100 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ సినిమా ‘అత్తారింటికి దారేది’ నుండి లేటెస్ట్ ఇండస్ట్రీ హిట్ ‘అల వైకుంఠపురములో’ సినిమా వరకూ ఒకే తరహాలో కథను ఫాలో అవుతూ హిట్స్ సాధించడం కేవలం మన మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్లనే సాధ్యపడింది.

 

అయితే తను రాసిన రొటీన్ కథ నే మళ్ళీ తీసుకొని తన మార్క్ ఎంటర్టైన్ మెంట్, మ్యూజిక్, పంచ్ డైలాగ్స్ వంటి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో స్క్రీన్ లో మేజిక్ క్రియేట్ చేసి హిట్ అందుకుంటున్న త్రివిక్రమ్ మీద కాపీ కథ అన్న ముద్ర కూడా ఉంది. ఆయన ఏ సినిమా లైన్ తీసుకున్నా అది ఎక్కడి నుండో తీసుకొని డెవలప్ చేసినదే అన్న విమర్శలు ప్రతీ సినిమాకి వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన అల వైకుంఠపురములో సినిమాకి కూడా అలాంటి కామెంట్సే వినిపించాయి. అయితే నెక్స్ట్ సినిమా కథ విషయం లోనైనా తన పంథా మరుస్తారా లేక అదే ఫాలో అవుతారా అంటూ టాక్ మొదలైంది. త్రివిక్రమ్ నెక్స్ట్ ఎన్టీఆర్ తో ‘అయినను పోయిరావలె అస్తినాకు’ అన్న టైటిల్ తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ కంటే ముందే బయటికి రావడంతో ఎన్టీఆర్ తో మళ్ళీ తనకి కలిసొచ్చిన, సక్సస్ ఇస్తున్న కథతోనే ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీస్తారని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. పవన్ కల్యాణ్ తో తీసిన ‘అజ్ఞాతవాసి’ సినిమా డిజాస్టర్ అవడంతో ఎన్.టి.ఆర్ తో తెరకెక్కించిన ‘అరవింద సమేత’ ఓ ఫ్యాక్షన్ కథతో రూపొందించారు. ఈ సినిమా మరీ బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినప్పటికి నిర్మాతకి మాత్రం లాభాలని తెచ్చిపెట్టింది. దాంతో ఇప్పుడు కూడా ‘అయినను పోయిరావలె అస్తినాకు’ ఫ్యాక్షన్ కథ నే సెలెక్ట్ చేసుకున్నారట త్రివిక్రమ్. ఈ కథ రాయలసీమ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కిస్తారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news