చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ భారత్‌లో రెడ్‌మీ 9 ప్రైమ్ పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో 6.53 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇందులో మీడియాటెక్ హీలియో జి80 ప్రాసెసర్‌ను అమర్చారు. వెనుకభాగంలో 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతోపాటు 8 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ కెమెరా, 5 మెగాపిక్సల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్‌లను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో వెనుక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. 5020 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది. దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు.
రెడ్‌మీ 9 ప్రైమ్ స్పెసిఫికేషన్లు…
* 6.53 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
* 2340 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి80 ప్రాసెసర్
* 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 13, 8, 2, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
* 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్
* డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0
* యూఎస్‌బీ టైప్ సి, 5020 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
రెడ్‌మీ 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ స్పేస్ బ్లూ, మిన్ గ్రీన్, సన్‌రైజ్, మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.9,999గా ఉండగా, 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.11,999గా ఉంది. దీన్ని అమెజాన్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లలో ఆగస్టు 6 నుంచి విక్రయిస్తారు.