మొబైల్స్ తయారీదారు షియోమీ తన రెడ్‌మీ నోట్ 9 ప్రొ, నోట్ 9 ప్రొ మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లకు గాను షాంపేన్ గోల్డ్ కలర్ వేరియెంట్లను విడుదల చేసింది. ఈ ఫోన్లు ఇప్పటికే ఇంటర్ స్టెల్లార్ బ్లాక్, అరోరా బ్లూ, గ్లేసియర్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త వేరియెంట్లు కూడా ఆ కలర్ల జాబితాలోకి వచ్చి చేరాయి. ఆయా ఫోన్లకు చెందిన కొత్త వేరియెంట్లను ప్రస్తుతం వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.
షియోమీ రెడ్‌మీ నోట్ 9 ప్రొ స్మార్ట్‌ఫోన్ రూ.13,999 ప్రారంభ ధరకు లభిస్తుండగా, రెడ్‌మీ నోట్ 9 ప్రొ మ్యాక్స్ రూ.16,999 ప్రారంభ ధరకు లభిస్తోంది. ఈ ఫోన్లలో పలు కామన్ ఫీచర్లను అందిస్తున్నారు. 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, స్నాప్‌డ్రాగన్ 720జి ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5020 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.. తదితర ఫీచర్లు రెండింటిలోనూ ఉన్నాయి.
ఇక నోట్ 9 ప్రొలో వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ కెమెరాను ఇవ్వగా, ప్రొ మ్యాక్స్‌లో వెనుక వైపు 64 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ప్రొ మ్యాక్స్‌లో ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, నోట్ 9 ప్రొ లో ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. నోట్ 9 ప్రొ లో 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను, ప్రొ మ్యాక్స్‌లో 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తున్నారు.