కరోనా వైరస్ ఇంటిలోకి రాకుండా ఇలా జాగ్రత్తలు పాటించండి..!

కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో మాటలో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మహమ్మరి మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఈ నియమాలు పాటించాల్సిందే. ప్రతి రోజూ ఉదయం మీ ఇంటి డాబా మీద లేదా ఇంటి బయట ఎండలో పావుగంట సేపు శ్వాస వ్యాయామాలు యోగా తప్పనిసరిగా చేయండి. దీని వల్ల మీ శరీరం ఉత్తేజితం అవుతుంది. ఇంట్లో ప్రతి ఒక్కరూ గోరు వెచ్చని నీరు మాత్రమే తాగండి. ఆయుర్వేదంలో సూచించిన విధంగా అల్లం, వెల్లుల్లి, మిరియాలు, శొంఠి, పసుపు, లవంగాలు, మిరియాలు మొదలైనవి నీటిలో బాగా మరిగించి రెండు, మూడు పూటలా తాగాలి.

tips
tips

రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలలో చిటికెడు పసుపును కలుపుకుని తాగండి. మన ఇంట్లో ఉండే చిన్న పిల్లలు, పెద్ద వాళ్ళే మనకు విలువైన ఆస్తి. వారికి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి వారు త్వరగా కోవిడ్ బారిన పడే అవకాశాలు ఎక్కువ కనుక ఇంట్లో మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి.

బయట నుండి ఇంటికి తెచ్చిన ప్రతి వస్తువులను తప్పనిసరిగా శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలి.ఒకవేళ బయటికి వెళ్ళితే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి, తరచుగా శానిటైజర్ ని చేతులకు రాసుకుని దగ్గర పెట్టుకోండి.బయటకు వెళ్లినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ముక్కును, నోటిని, కళ్లను చేతులతో తాకవద్దు.

రోగనిరోధక శక్తి ని పెంచే సి విటమిన్ ఎక్కువగా వుండే పండ్లు నిమ్మ, జామ, ఉసిరితో పాటు ఆపిల్స్, బొప్పాయి, నారింజ మొదలైనవి తరచుగా తీసుకోవాలి. రోజు రాత్రి సమయంలో నీళ్లలో బిటడిన్ ద్రావణం కలిపి నోట్లో పోసుకుని గొంతులోకి వెళ్ళే లాగా పుక్కిలించి గార్గిల్ చేయాలి. గోరువెచ్చని నీటిలో ఉప్పువేసి పుక్కిలించాలి. ప్రతి రోజు కనీసం 6 -8 గంటలు నిద్ర ద్వారా విశ్రాంతి తీసుకోండి. మద్యపానం జోలికి వెళ్ళక పోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.