ఆదాయపు పన్ను ని ఈ 7 అలవెన్సులతో తగ్గించుకోండి..!

-

తప్పనిసరిగా ఆదాయ పన్ను రిటర్న్ పన్ను చెల్లింపుదారులు ప్రతీ ఏటా ఫైల్ చెయ్యాలి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి జులై 31వ తేదీలోగా ఫైల్ చేయాలి. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు నెట్‌ ట్యాక్స్‌ లయబిలిటీ, ట్యాక్స్‌ డిడక్షన్స్‌ క్లెయిమ్‌ వంటివి హెల్ప్ అవుతాయి. ఇక పూర్తి వివరాలని చూస్తే.. సెక్షన్ 10 కింద ఉన్న, ఫారం 16లో పేర్కొన్న అలవెన్సులను క్లెయిమ్ ని ఎక్కువ మంది చేస్తారు.

హౌస్‌ రెంట్‌ అలవెన్సు: హౌస్‌ రెంట్‌ అలవెన్సు(సెక్షన్‌ 10(13A)) కూడా హెల్ప్ అవుతుంది. అద్దె ఇంట్లో నివసించే ఉద్యోగులు క్లెయిమ్‌ చేయవచ్చు. మీరు కనుక మెట్రో నగరాల్లో వుంటుంటే జీతంలో 50 శాతం లేదా ఇతర నగరాల్లో 40 శాతం ఎగ్జమ్షన్‌ క్లెయిమ్‌ చేయవచ్చు.

రీలొకేషన్‌ అలవెన్సు:

రవాణా ఖర్చులు, కారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ప్యాకేజింగ్ ఛార్జీలు ఏదైనా కారణాల వలన వేరే చోటకి వెళితే ఇది హెల్ప్ అవుతుంది.

లీవ్‌ ట్రావెల్‌ కన్‌సెషన్‌ లేదా అసిస్టెన్స్‌:

(LTC/LTA) (10(5)) కూడా హెల్ప్ అవుతుంది. భారతదేశంలో చేసే ప్రయాణ ఖర్చులను ట్యాక్స్‌ ఫ్రీగా పరిగణిస్తారు. నాలుగు క్యాలెండర్ ఇయర్‌లలో రెండు ప్రయాణాలకు ఎగ్జమ్షన్‌ వుంది.

హెల్పర్ అలవెన్సు:

ఆఫీస్ అధికారిక పనుల కోసం ఒక సహాయకుడిని నియమించడానికి యజమాని అనుమతించే సందర్భాలలో ఇది పనికొస్తుంది.

పుస్తకాలు, పీరియాడికల్‌ అలవెన్సు:

ఇది కూడా హెల్ప్ అవుతుంది. పుస్తకాలు, వార్తాపత్రికలు, పత్రికలు, జర్నల్స్ లాంటి ఖర్చుల కి ఇది వర్తిస్తుంది.

ఎడ్యుకేషన్‌ అలవెన్సు:

ఎడ్యుకేషన్‌ అలవెన్సు అనేది మాక్సిమం ఇద్దరు పిల్లలకు పని చేస్తుంది. ఒకరికి నెలకు రూ.100 వరకు ఎగ్జమ్షన్‌ ఉంటుంది.

యూనిఫాం అలవెన్సు:

విధుల సమయంలో దుస్తులు ధరించడానికి యూనిఫాం ఖర్చుల్లో ఎగ్జమ్షన్‌ ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version