ప్రస్తుతం మార్కెట్ లో బంగారానికి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సాధారణంగా ప్రతీ రోజు మహిళలు పొద్దన నిద్ర లేవగానే ఇవాళ బంగారం ఎంత రేటు ఉంది. ఏ రోజు తీసుకుంటే బాగుంటుందని చర్చించుకుంటుంటారు. ప్రధానంగా బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఉదయం ఒక ధర ఉంటే.. మళ్లీ సాయంత్రం వరకు మరో ధర ఇలా నిత్యం మార్పులు, చేర్పులు ఉంటాయి.
తాజాగా ఆదివారం బంగారం, వెడి ధరలు కాస్త తగ్గాయనే చెప్పాలి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.610 తగ్గి రూ.70,390 కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.660 తగ్గి రూ.76,790 కి చేరింది. వెండి కిలో ధర రూ.99,000గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,000 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,450. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,000, 24 క్యారెట్ల ధర రూ.77,450. ఇక వెండి విషయానికి వస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ.99,000 గా ఉంది.