నవీన్ హ్యత కేసుపై FIR నమోదు.. నిందితుడు సంచలన వాంగ్మూలం

-

నవీన్ హత్యకేసులో నిందితుడిపై FIR నమోదు చేశారు పోలీసులు. తాజాగా అబ్దుల్లాపీర్‌మెట్‌ పీఎస్‌లో లొంగిపోయిన నిందితుడు హరిహరకృష్ణ..హత్య గురించి సంచలన విషయాలను చెప్పాడు. దీంతో ఐపీసీ 302, 301, పలు సెక్షన్ల కింద హరిహరకృష్ణపై కేసు నమోదు చేశాడు పోలీసులు. నిందితుడు ముసారాంబాగ్‌కు చెందినవాడిగా గుర్తించారు పోలీసులు. ఇక ఈ సందర్భంగా నిందితుడు హరిహరకృష్ణ సంచలన వాంగ్మూలం కూడా ఇచ్చాడు.

తన లవర్‌ ను ప్రేమిస్తున్నాడనే కోపంతో.. నవీన్‌ ను హత్య చేశాడు హరిహర కృష్ణ. నవీన్ ను కత్తితో కడుపులో పొడిచి, ఆ తర్వాత మర్మాంగాలను కోసి, తల మొండెం వేరు చేశాడు హరి హర కృష్ణ. నా ప్రియురాయల్ని ప్రేమిస్తావా అంటూ శరీరం నుంచి గుండెను వేరు చేసిన హరిహర కృష్ణ… నవీన్ ను హత్య చేసినట్లు పోలీసుల వద్ద వాంగ్మూలం ఇచ్చాడు. తన లవర్‌ ను ప్రేమించినందుకే చంపానంటూ పోలీసులకు తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news