కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయారు. ఈ క్రమంలో కరోనా ప్రభావం పూర్తిగా తగ్గే వరకు మళ్లీ ఉద్యోగాలు లభించే అవకాశం లేదు. అయినప్పటికీ ఉద్యోగులు, ఫ్రెషర్స్ తమ స్కిల్స్ ను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకుంటూ ఉండాలి. దీంతో భవిష్యత్తులో ఏర్పడే ఉద్యోగ అవకాశాలను సులభంగా అందిపుచ్చుకోవచ్చు. ఉద్యోగం సులభంగా లభిస్తుంది. అయితే అభ్యర్థులకు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకునేందుకు పలు యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. గ్రాడ్యుయేషన్ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన ఫ్రెషర్స్‌తోపాటు నిరుద్యోగులు స్కిల్స్‌ను మెరుగు పరుచుకోవాలి. ఇందుకు గాను Prepbytes అనే యాప్ సహాయం చేస్తుంది. ఇందులో పలు కోడింగ్ మెళకువలను నేర్చుకోవచ్చు. దీంతో ఉద్యోగావకాశాలు మెరుగు పడతాయి.
2. స్టాక్ మార్కెట్‌లో కెరీర్‌ను ఆశిస్తున్న వారు StockGro అనే యాప్ లో వర్చువల్‌గా స్టాక్ ట్రేడింగ్ చేయవచ్చు. అందులో మెళకువలను నేర్చుకోవచ్చు. దీంతో ఆ రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
3. కాంపిటీటివ్ పరీక్షలకు హాజరయ్యే వారికి Unacademy యాప్ ఎంతగానో దోహదపడుతుంది. ఇందులో పాఠాలను నేర్చుకుని ఎగ్జామ్స్ రాయవచ్చు. పాఠ్యాంశాలపై అవగాహనను మరింత మెరుగు పరుచుకోవచ్చు. దీంతో ఏదైనా సబ్జెక్ట్‌పై మరింత అవగాహన ఏర్పడుతుంది. ఎగ్జామ్‌లలో ఇంకా ఎక్కువ స్థాయిలో ఉత్తీర్ణత సాధించవచ్చు.
4. పాడ్‌కాస్ట్ రంగంలో రాణించాలనుకునే వారికి Anchor అనే యాప్ ఉపయోగపడుతుంది. ఇందులో పాడ్‌కాస్ట్‌లను రికార్డు చేసి వాటిని ఎడిట్ చేసుకుని పబ్లిష్ చేయవచ్చు.
5. ఆయా రంగాల్లో మెళకువలను నేర్చుకునేందుకు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకునేందుకు Life Quest అనే యాప్ ఉపయోగపడుతుంది. ఇందులో నిపుణులు విలువైన సలహాలు, సూచనలు ఇస్తారు. వాటితో అభ్యర్థులు తమ కెరీర్‌ను తమకు అనుగుణంగా మలుచుకోవచ్చు.