మారుమూల పల్లెటూరు.. పశువులను మేపిన స్టేజ్ నుంచి.. ఆర్మీ ఆఫీసర్ అయింది..!  

-

లైఫ్ లో ఏదైనా సాధించే వరకూ.. ప్రపంచం మనల్ని గుర్తించదు.. ఒక్కసారి విజయం మన వైపు చూసిందంటే.. ఇక మన పరిచయం అక్కర్లా.. కొండల్లో ఉన్నా గుట్టల్లో ఉన్నా.. ఫేమస్ అయిపోతాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అదే కథ. ఇంట్లో వెట్టిచాకిరి చేస్తూనే చదువుకుని నేడు సైన్యాధికారి అయింది. శరణ్య లైఫ్ లో పడ్డ కష్టాలు, ఆటుపోట్లు నేడు యావత్ ప్రపంచం కోడై కూస్తుంది. మీరు ఈ స్పూర్తి నింపే కథ పూర్తిగా చదివేయండి.!
ఈరోడు జిల్లాలోని అందియూరు సమీపంలో ఉన్న నంజమడైకుట్టై శరణ్య సొంతూరు. అసలు ఇది ఊరు కాదు.. కొండల్లో ఒదిగిన నాలుగు గడపల గూడెం. అక్కడకు రవాణా చేయడం కూడా కష్టమే. ఎటు చూసినా పచ్చిక బయళ్లతో ఉంటుంది. పశువుల పెంపకమే అక్కడ ఎంతోమందికి జీవనాధారం. శరణ్యది కూడా అటువంటి కుటుంబమే. చిన్నప్పట్నుంచీ ఆ ఇంట్లో వ్యవసాయ పనులన్నీ శరణ్యే చేసేదట.
పశువులనీ కాసేది. కూతురు చలాకీతనం, ధైర్యం చూసి.. నాన్న మోహన్‌సుందరం చదువు, కెరియిర్‌ వంటి విషయాలని ఆమెకే వదిలేశాడు. అందుకే శరణ్య ఐటీ ఉద్యోగం వదిలి కబడ్డీ వైపు అడుగులు వేసింది.
ఓ వైపు చదువుకుంటూనే వ్యవసాయ పనులు చేసేది… పశువులనీ కాసేది… అందియూర్‌లో ఉన్న బడికి రోజూ రెండు గంటలు ప్రయాణించి వెళ్లేదట. కబడ్డీ అంటే ఇష్టం. స్కూల్‌లో మొదలైన ఆ ఇష్టం కాలేజీకెళ్లినా పోలేదు. అన్నావర్సిటీ తరపున ఆడే అవకాశం వచ్చింది. దాంతో సివిల్‌ ఇంజినీరింగ్‌కయ్యే ఖర్చుని కాలేజీ యాజమాన్యమే భరించింది. చదువు పూర్తయ్యాక కాగ్నిజెంట్‌ ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మంచి జీతం ఉన్నా.. తనకెంతో ఇష్టమైన కబడ్డీ ఆడలేకపోయాననే భావన తనలో ఎప్పుడూ ఉండేదట.
లైఫ్ లో చేసే పని నచ్చకపోతే.. అది ఎంత లాభాన్ని ఇచ్చిన మనసుకు ప్రశాంతత ఉండదు. ఎప్పుడూ ఏదో కోల్పోయిన భావన ఉంటుంది. శరణ్య కూడా అలానే అనుకునేదట.. దాంతో ఉద్యోగం మానేసి ఆరునెలలు కబడ్డీ ఆడి… రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంది. డబ్బులొచ్చే ఉద్యోగం వదలి ఇలా ఆడతానంటే ఏ ఇంట్లోనూ ఒప్పుకోరు కదా.. అందులోనూ శరణ్య ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్.. కు డబ్బులు చాలా అవసరం.. కానీ తనకు ఇష్టమైన కెరియర్‌ ఎంచుకొనే అవకాశాన్ని కుటుంబం కల్పించింది. ఆ ఆత్మవిశ్వాసంతోనే తన ఆలోచనలు మిలటరీవైపు మళ్లాయి.

ఇంగ్లీష్ రాక వెనుకడగు..

ఆలోచన బానే ఉంది.. కానీ మిలటరీలోకి ఎలా వెళ్లాలో తెలియదు. ఆ ఊళ్లో ఒక్కరు కూడా సైన్యంలో లేరు. అందుకే మిలటరీ శిక్షణ ఎలా ఉంటుందని చాలామందిని అడిగి తెలుసుకునేదానట. గత ఏడాది జూన్‌లో సైన్యంలో చేరడానికి ఎస్‌ఎస్‌బీ(సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు) పరీక్షలు రాసి… దీని శిక్షణ కోసం కోవైలోని ప్రైవేటు అకాడమీలో చేరింది.. మూడు నిముషాల పాటు ఆపకుండా ఇంగ్లీషులో మాట్లాడి రోజూ వీడియో తీసి పంపమనే వారు. ప్రారంభంలో 50, 60 సార్లు వీడియో టేక్‌లు తీసుకుని కూడా చెప్పలేకపోయేదట. చాలా టాస్క్‌లు ఇచ్చేవారు. మొదట్లో అవి చేయలేక, వెనకడుగు వేసింది.. దాంతో అకాడమీ నుంచి తీసేశారు. కానీ పట్టుదలతో మూడు నెలల తర్వాత మళ్లీ చేరింది.. బాగా మెరుగైంది.
భోపాల్‌, బెంగళూరుల్లో నిర్వహించిన సైనిక పరీక్షల్లో ఎంపిక కాలేదు. తప్పులను సమీక్షించుకుని మూడో ప్రయత్నంగా అలహాబాద్‌ లో నాలుగు రోజుల్లో 17 టెస్టులు నిర్వహించారు. మాజీ సైనికుడు, కోచ్‌ లెఫ్టినెంట్‌ ఈసన్ ఇచ్చిన ధైర్యంతో పరీక్షలన్నీ పూర్తిచేసింది.‌. ఎంతోమంది ఆయన శిక్షణలో తమ కలల్ని నెరవేర్చుకున్నారు. 190 మంది అలహాబాద్‌లో రిపోర్టు చేస్తే అందులో 26 మంది స్క్రీన్‌ఇన్‌ అయ్యారు. అందులో ఐదుగురు మాత్రమే సైన్యంలో చేరడానికి అర్హత సాధించారు. ఈ ఐదుగురిలో కూడా ముగ్గురు సైనిక కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే. కానీ మారుమూల గ్రామం నుంచి వచ్చిన అమ్మాయిని శరణ్య మాత్రమేనట.

ఆ కష్టం వర్ణణాతీతం..

రాత్రి 12 గంటల వరకు ఇంటి పనులు, వ్యవసాయ పనులు ఉండేవి. అవన్నీ చేసి తిరిగి ఉదయం నాలుగు గంటలకు లేచి శిక్షణకు వెళ్లేది. ఊరి నుంచి బస్సులు కూడా ఉండవట.. చాలా కష్టపడేది. చాలామంది సైన్యంలో చేరుతుందా… ప్రాణాలు పోతాయ్‌ అని హెచ్చరించేవారు. ప్రాణాలు ఎక్కడయినా పోవచ్చు. అక్కడికి వెళ్తేనే పోతాయనేది పొరపాటు’ అంటోంది శరణ్య తల్లి తవలక్ష్మి. కుటుంబం తోడుగా ఉంటే.. ఎంతటి కష్టాన్ని అయినా.. ఈజీగా జయించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news