కొడాలి నాని పై రేణుకా చౌదరి పోటీ

-

ఏపీ ప్రస్తుతం అమరావతి రైతులు.. పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే… ఈ పాదయాత్ర నేపథ్యంలో అమరావతి రైతులకు మద్దతుగా కేంద్ర మాజీమంత్రి రేణుక చౌదరి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ తరుణంలోనే రేణుకను మాజీ మంత్రి కోడలి నాని టార్గెట్ చేశారు. కార్పోరేటర్ గా కూడా గెలవని వ్యక్తి అంటూ కామెంట్ చేయగా, రేణుక చౌదరి ఓ ఇంటర్వ్యూలో నానికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

కొడాలి నాని రాజకీయాల్లోకి రాకముందే తాను కార్పొరేటర్ అంటూ ఘాటుగా స్పందించారు. ‘బుజ్జి నీకు చరిత్ర తెలియదు, రాజీవ్ గాంధీ ఇచ్చిన మొబైల్ లో గూగుల్ కొట్టు, రేణుకా చౌదరి అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. నువ్వు మాజీ మంత్రి కదా, నువ్వు ఏదో పదవి కోసం అసెంబ్లీలో నా పేరు తీసుకొచ్చావు. చాలా థాంక్స్’ అన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో ఆయన నియోజకవర్గంలో గుడివాడ నుంచి పోటీ చేస్తానని, తాను మున్సిపల్ కార్పొరేటర్ గా చేశా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశానన్నారు. తన సత్తా ఏంటో కొడాలి నానికి తెలియదని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news