వావ్: గాలిని నీళ్ళగా మార్చేస్తున్నారు

Join Our Community
follow manalokam on social media

నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్‌యుఎస్) పరిశోధకులు ఎటువంటి బాహ్య శక్తిని ఉపయోగించకుండా గాలి నుండి నీటిని వేరు చేసే పరికరాన్ని సృష్టించారని సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం తెలిపింది . సింగపూర్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల బృందం బ్యాటరీ అవసరం లేని స్పాంజిలా పనిచేసే అల్ట్రా-లైట్ ఎయిర్‌జెల్‌ను తయారు చేసింది. ఎయిర్జెల్ గాలి నుండి నీటిని లాగుతుంది.

కాని దాని నుండి నీటిని తీయడానికి దాన్ని పిండి లాగాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అధ్యయనం ప్రకారం… ఒక కిలోల ఎయిర్‌జెల్ 17 లీటర్ల నీటిని ఉత్పత్తి చేస్తుంది. స్పాంజి లాంటి ఎయిర్‌ జెల్ పాలిమర్‌ లతో రూపొందించబడింది. పాలిమర్లు గాలి నుండి నీటిని తీస్తాయి అని అధికారులు పేర్కొన్నారు. ఎయిర్జెల్ గాలి నుండి నీటి అణువులను ఆకర్షిస్తుంది. వాటిని ద్రవంగా ఘనీకరిస్తుంది అని నీటిని బయటకు తీస్తుంది అని వెల్లడించారు.

వేడి ఎక్కువగా ఉన్న రోజున, ఎయిర్‌జెల్ మరింత త్వరగా పనిచేస్తుంది అని తెలిపారు. ఇది ఎయిర్‌జెల్ నుండి 95 శాతం నీటి ఆవిరిని ద్రవ నీటిగా మారుస్తుంది అని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) యొక్క తాగునీటి ప్రమాణాలకు అనుగుణంగా దాని నీటిని పరిశోధకులు నిర్ధారించారు. ” మా ఆవిష్కరణ వివిధ రకాల వాతావరణ పరిస్థితులలో, కనీస శక్తి వ్యయంతో స్థిరమైన మంచినీటి ఉత్పత్తిని సాధించడానికి మంచి పరిష్కారాన్ని అందిస్తుంది” అని వారు పేర్కొన్నారు.

TOP STORIES

మీరు చేసే జాబ్ మీకు హ్యాపీగా అనిపించాలంటే వీటిని అనుసరించండి..!

మనం చేసే పని వల్ల మనకి ఆనందం మాత్రమే కలగాలి. ఇష్టపడుతూ జాబ్ చేయడం వల్ల ఫ్రస్ట్రేషన్, సాటిస్ఫాక్షన్ లేకపోవడం లాంటివి ఉండవు. అలానే ఎప్పుడూ...