ఆ మంత్రి పైనే టీడీపీ గురి పెట్టిందా

-

పోటి చేసిందే తొలిసారి..గెలిచిన మొదటిసారే లక్కీ చాన్స్ ల మంత్రి పదవి కాలం భలే కలిసొస్తుందనుకున్న సమయంలోనే వరుస వివాదలు ఆ మంత్రిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట..జిల్లాలో సీనియర్ మంత్రి స్పీకర్ ఉన్నా ప్రతిపక్షం మాత్రం ఆ మాంత్రిని టెర్గెట్ చేసింది. ఆయన స్పీడ్‌కు బ్రేక్‌లు వేసేందుకు ముప్పేట దాడి చేస్తుందట సైకిల్ పార్టీ..సిక్కోలులో జరుగుతున్న ఈ పరిణామాల పై అధికార,విపక్ష పార్టీల్లో ఆసక్తి కర చర్చ నడుస్తుంది.

శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్‌గా తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎంగా ధర్మాన కృష్ణదాస్‌ ఉన్నా.. మంత్రి అప్పలరాజు తీరు మరోలా ఉందని లెక్కలు వేస్తున్నారట టీడీపీ నేతలు. అందుకే పలాసలో మంత్రి పాతుకుపోకుండా ఇప్పటి నుంచే గురిపెట్టాలని నిర్ణయించారట. మంత్రికి వ్యతిరేకంగా ఏ అంశం వచ్చినా రచ్చ రచ్చ చేసి వివాదం సృష్టిస్తున్నారట…

గడచిన ఏడాదిన్నర కాలంగా కామ్‌గా ఉన్న ప్రతిపక్షపార్టీ ఒక్కసారిగా పలాసపై స్పెషల్ ఫోకస్ పెట్టడమే ఇందుకు కారణం. 2019 ఎన్నికల్లో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన సీదిరి అప్పలరాజు ఏడాది తిరగకుండానే మంత్రిగా ప్రమోషన్ కొట్టేశారు. మంత్రి అప్పలరాజు నియోజకవర్గంతో పాటు జిల్లాలోనూ స్పీడు పెంచడంతో ఎన్నికల్లో ఓడిన తర్వాత సైలెంట్‌గా ఉన్న గౌతు కుటుంబం కూడా ఒక్కసారిగా సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పలాసలో అధికారపార్టీ నేతలు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఎంట్రీలోనే ఘాటైన విమర్శలు చేశారు గౌతు శిరీష.

మత్స్యకార భరోసాలో టీడీపీకి చెందిన వారి పేర్లను తొలగించడంపై టీడీపీ నేతలు ఫైరవుతున్నారు. అర్హులకు రావాల్సిన సొమ్మును సొసైటీ మాటున దోచేశారని రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తెరలేపారు. అయితే మంత్రి అప్పలరాజు సోషల్‌ మీడియా సైన్యం టీడీపీ ఆరోపణలకు గట్టిగానే కౌంటర్లు ఇస్తోంది. దీంతో ఈ పోరాటంలో శిరీష ఒంటరి కాదని చెప్పడానికి టీడీపీ నేతలు మద్దతుగా నిలిచారట. అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు, కూన రవి తదితరులు పలాసపై ఫోకస్‌ పెట్టడాన్ని ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు తెలుగుతమ్ముళ్లు.

టీడీపీ నేతల విమర్షల పై గట్టిగానే కౌంటర్ ఇచ్చారు మంత్రి అప్పలరాజు అయితే ఈ ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చే క్రమంలో అప్పలరాజు ఎంచుకున్న అంశం గురితప్పిందనే ప్రచారం జరుగుతోంది. గౌతు లచ్చన్న విగ్రహంపై మంత్రి చేసిన కామెంట్స్‌ దుమారం రేపాయి. ఈ అంశాన్నే ఎజెండా చేసుకుని నానా జిల్లా వ్యాప్తంగా నానా యాగీ చేసింది టీడీపీ..ఈ వివాదంలో వైసీపీ నుంచి మంత్రి అప్పలరాజుకు మద్దతు లభించలేదని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

ఆ తర్వాత టీడీపీ కార్యకర్తల పై అక్రమ కేసులు పెడుతున్నారని..సోషల్‌ మీడియాలో మంత్రికి సవాల్‌ విసిరిన టీడీపీ కార్యకర్త పై అక్రమ మద్యం కేసు పెట్టారని ఫైరవుతున్నారు టీడీపీ నేతలు. మొత్తానికి ఏ అంశం దొరికినా టీడీపీ నేతలు రచ్చ చేసి మంత్రి తల బొప్పి కట్టిస్తున్నారు. ఈ సమస్యల నుంచి ఈ యంగ్ డైనమిక్ మినిస్టర్ ఎలా బయటపడతారో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news