మద్యం అమ్మకాల కోసం మద్యపాన ప్రియులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అందరికి తెలిసిదే. మద్యం అమ్మకాల విషయంలో ఏ నిర్ణయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే అవకాశం ఉందా అని చాలా మంది ఆశగా ఎదురు చూసారు. కరోనా కంటే మందు లేక చచ్చిపోతారేమో అన్నట్టు చేసారు కొందరు. ఎర్రగడ్డ ఆస్పత్రికి వెళ్ళిన బ్యాచ్ కూడా ఉందీ అనేది అందరికి తెలిసిందే. కేంద్రం తాజాగా లాక్ డౌన్ ని పెంచింది.
ఈ సందర్భంగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అది కూడా పరిమితంగా మాత్రమే ఉంటుంది అని చెప్పింది కేంద్రం. ఈ నేపధ్యంలో మద్యం అమ్మకాల కోసం జనాలు చాలా ఎదురు చూస్తున్నారు. ఇక ఏపీలో సోమవారం నుంచి మద్యం అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో 4 నుంచి రాష్ట్రంలోని గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలు మొదలుపెట్టాలని నిర్ణయించింది.
దీనిపై నేడు ఏపీ సర్కార్ అధికారిక ఉత్తర్వులు ఇస్తుంది. భౌతిక దూరం పాటిస్తూ అమ్మకాలు జరిపేలా అధికారులు ఏర్పాట్లు చేసారు. లాక్‌డౌన్ పూర్తయ్యే వరకూ బార్లకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా అనుమతి లేదు. జిల్లాలను యూనిట్‌గా తీసుకుంటే ఐదు జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి కాబట్టి అక్కడ మద్యం దొరికే అవకాశం లేదనే చెప్పాలి. మండలాలను తీసుకుంటే మాత్రం మిగిలిన మండలాల్లో మద్యం అమ్ముతారు.