చలపతిరావు మృతి పట్ల నారా లోకేష్ దిగ్భ్రాంతి

-

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. బంజారాహిల్స్ లోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు చలపతిరావు. 1944 మే 8న కృష్ణాజిల్లా బల్లిపర్రులో చలపతిరావు జన్మించారు. ఆయనకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

దాదాపు 1200 కు పైగా సినిమాలలో నటించారు చలపతిరావు. 1966 లో గూడచారి 116 చిత్రంతో సినీ రంగంలో అడుగు పెట్టారు. చలపతిరావు మృతి పట్ల టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అని.. వారి కుటుంబ సభ్యులకు నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news