తెలంగాణలో సడలింపుల గురించి తెలుసా?

-

దేశం మొత్తం మే 3 వరకూ లాక్ డౌన్ అని ప్రకటిస్తే… తెలంగాణలో కేసీఆర్ సర్కార్ మాత్రం మే 7 వరకూ అని ప్రకటించింది. దీంతోనే అక్కడి ప్రభుత్వ ఆలోచనా విధానంపై ఒక క్లారిటీ తెచ్చుకోవచ్చు! ఈ క్రమంలో… లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తినా పర్లేదు కానీ కనీసం సడలింపులైనా ఇస్తే బాగుండు అని సగటు తెలంగాణ ప్రజా కోరుకుంటున్నారట! ఇందులో ప్రత్యేకించి జీహెచ్ఎంసీ జనాలైతే మరీ కోరుకుంటున్నారట! వారి వారి కోరికలు అలా ఉంటే… ఇప్పటికే ఉన్న సడలింపులను కుదిస్తూ.. మరింత స్ట్రిక్ట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది! ఇదే సమయంలో… తెలంగాణలో లాక్ డౌన్ సడలింపులు ఎప్పుడు ఉండొచ్చు అనే విషయంపై కూడా క్లారిటీ ఇస్తోంది!

కరోనా వైరస్ వ్యాప్తి తెలంగాణలో ఉద్థృతంగా ఉందనే చెప్పుకోవాలి. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 928కి పెరిగింది. ఇదే క్రమంలో మరణాల సంఖ్య 23 గా ఉంది. ఈ 56 కేసుల్లో సూర్యాపేట జిల్లాలో ఈ ఒక్కరోజే 26 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవగా జీహెచ్ఎంసీ పరిధిలో 19 కేసులు నమోదయ్యాయి. ఇలా ఊరుపేరు మారుతూ ఉంది కానీ రోజు వారీ కొత్త కేసుల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఇదే క్రమంలో ప్రతీరోజూ నేనున్నానంటుంది జీహెచ్ఎంసీ! ఈ క్రమంలో తెలంగాణలో సడలింపులపై ఒక క్లారిటీ వచ్చింది!

తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు, రాబోయే కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై మే 5న కేబినెట్‌ భేటీ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేబినెట్ భేటీ జరగడానికి పది రోజుల ముందు నుంచి కరోనా కేసులు నమోదు కాకపోతేనే లాక్ డౌన్ సడలింపు అంశాన్ని పరిశీలించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే… ఈ నెల 25 – 26 తేదీలలోనూ, ఆ తర్వాత ఇంక కొత్త కేసులు నమోదుకాని పక్షంలో… కచ్చితంగా లాక్ డౌన్ లో సడలింపులు పుష్కలంగా ఉండే అవకాశం ఉంది. అలా కానిపక్షంలో లాక్ డౌన్ మరింత స్ట్రిక్ట్ అవుతుంది!! అయితే… ప్రస్తుతం సరాసరిన రోజుకు 40 – 50 కేసులకు తక్కువ కాకుండా నమోదవుతున్న తరుణంలో ఇది ఎప్పటికి జరిగేనో అర్ధం కాని పరిస్థితి!

మే 5 తర్వాత సంగతి అలా ఉంచితే… ఇప్పటిదాకా ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కిరాణా, కూరగాయల దుకాణాలు తెరిచి ఉంటున్న సంగతి తెలిసిందే. దీనివల్ల రోజంతా రోడ్లపై తిరుగుతున్నారనో ఏమో కానీ… బుధవారం నుంచి ఉదయం 7 గంటలకు తెరవాలని, 12 గంటలకల్లా మూసివేయాలని పోలీసులు వ్యాపారులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news