సమాజంలో ఉన్నత పదవులను నిర్వహించిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని వర్గాలకు ఆదర్శంగా ఉండాలి. తప్పులు చేసే వారికి తప్పులు చేయవద్దు అని చెప్పాలి. కాని కొంత మంది మాత్రం వివాదాస్పదంగా వ్యవహరిస్తూ ఉంటారు. కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. తాజాగా గుంటూరు జిల్లాలో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. కోడలు పై రైటైర్డ్ ఎస్పీ చంద్యానాయక్ కుటుంబ వేదింపులు సంచలనంగా మారాయి.
కోడలు ఉన్నత చదువులు చదవడం ఇష్టపడని అత్తమామాలు.. ఆమెను అనేక విధాలుగా వేధిస్తున్నారు. ఇంట్లో నుంచి చంద్యానాయక్ కుటుంబం కోడలిని పంపించింది ఆయన కుటుంబం. అక్టోబర్ లో రెంటచింతల స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. నవంబర్ లో దిశా స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. రిటైర్డ్ ఎస్పీ కావడం తో రెండు చోట్ల పోలీసులు పట్టించుకోలేదు. సర్టిఫికేట్ , బట్టలు సైతం ఇవ్వకుండా ఇంటి నుంచి అత్తమామలు పంపించారు.
కట్టుబట్టలతో బాధిత యువతి రోడ్డున పడింది. తనకు న్యాయం చేయాలని మీడియా ను ఆశ్రయించిన బాధితురాలు… తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. 2017 లో చంద్యానాయక్ కొడుకు రాహుల్ నాయక్ తో యువతి కి వివాహం అయింది. అయితే పోలీసులు ఇప్పటికి కూడా స్పందించడం లేదనే ఆరోపణలు వినపడుతున్నాయి.