భట్టితో కలిసి కేటీఆర్ చర్చకు రా : రేవంత్ డెడ్ లైన్ !

-

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి మరియు తెలంగాణ కాంగ్రెస్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గం లో కాంగ్రెస్ మరియు బి.జె.పి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి కి నిజంగా దమ్ముంటే హుజూరాబాద్ నియోజకవర్గం లో డిపాజిట్ దక్కించుకోవాలని సవాల్ విసిరారు. అయితే దీనిపై కాంగ్రెస్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.

రేవంత్ రెడ్డి కేటీఆర్ | Revanth Reddy KTR

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, మున్సిపల్ శాఖలో అవినీతి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై… దేనిపైన ఆయన మంత్రి కేటీఆర్ తో చర్చకు తాను సిద్ధమని చెప్పారు రేవంత్ రెడ్డి. ఈ చర్చకు భట్టి విక్రమార్క ను తీసుకొని మంత్రి కేటీఆర్ రావాలని… నవంబర్ 15 లోపు వస్తే బాగుంటుందని డెడ్ లైన్ విధించారు రేవంత్ రెడ్డి.

దళిత బందు అపడం లో టిఆర్ఎస్ మరియు బిజేపి పార్టీలు తోడు దొంగలు అని.. ఇద్దరి కుమ్మక్కు లో భాగమే దళిత బందు ఆగిందని ఫైర్ అయ్యారు. రైతు బందు అగొద్దని ఎన్నికల కమిషన్ దగ్గర అమలు చేసిన కెసిఆర్..దళిత బందు విషయంలో ఎందుకు జోక్యం చేసుకోలేదని ప్రశ్నించారు. దళిత బందు పాత పథకం అని టిఆర్ఎస్ చెప్తుంటే… ఎందుకు ఇప్పుడు ఆగిందని నిలదీశారు. సీఎం.. cs ఎందుకు దళిత బందు అమలుకు చొరవ చూపడం లేదని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news