కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. తెరాస అధినేత, సీఎం కేసీఆర్ కొడంగల్ నియోజవర్గంలోని కోస్గిలో మంగళవారం నిర్వహించనున్న బహిరంగ సభను వ్యతిరేకిస్తూ…రెండు రోజుల క్రితం పలు ఆందోళనలు చేప్టటిన విషయం తెలిసిందే. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు రేవంత్ ని , ఆయన సోదరుడు కొండల్ రెడ్డిని ముందస్తు అరెస్ట్ చేశారు. అరెస్ట్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించారు. తన భర్తను బలవంతంగా తీసుకెళ్లారని, తమ ఆత్మ గౌరవం మీద దెబ్బకొడితే ఊరుకునేది లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని, ఓటుతో బుద్ధి చెప్పాలని గీత కోరారు. రేవంత్ అరెస్ట్‌కి ముందు అతని నివాసం వద్ద 100 మందికి పైగా పోలీసులు మోహరించారు.