పాక్ అభిమానులకు హసన్ అలీ క్షమాపణలు… ట్విట్టర్ లో ఎమోషనల్ పోస్ట్

-

టీ 20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్, ఆస్ట్రేలియా చేతిలో 5 వికేట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. వరల్డ్ కప్ గెలవాలనుకున్న పాక్ కలలు నెరవెరలేదు. ముఖ్యంగా మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ బ్యాటర్ మాథ్యూ వేడ్ క్యాచ్ ను వదిలివేయడంతో పాక్ ఆటగాడు హసన్ అలీ స్వదేశంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆ తరువాత వేడ్ చెలరేగి ఒకే ఓవర్ లో మూడు సిక్సులు కొట్టి ఆస్ట్రేలియాను గెలిపించాడు. ముఖ్యంగా ఆదేశ అభిమానుల నుంచి విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. హసన్ అలీ షియా ముస్లీం కావడంతోనే ఇలా చేశారని కొందరు.. హసన్ అలీ భార్య భారత ’ రా‘ ఏజెంట్ కావడంతోనే క్యాచ్ జార విడిచారని మరికొందరు ఇలా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు.

కాగా తాజాగా హసన్ అలీ పాక్ అభిమానులకు క్షమాపణలు చెబుతూ.. ట్విట్టర్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ’ నా ఆటతీరుతో మీ అంచానాలను అందుకో లేకపోయినందుకు మీరంతా బాధ పడ్డారని తెలుసు..కానీ మీకంటే నేను ఎక్కువ నిరాశ చెందాను. నేను పాకిస్తాన్ క్రికెట్ కు సాధ్యమైనంత అత్యున్నత స్థాయిలో సేవ చేయాలనుకుంటున్నాను. తిరిగి కష్టపడి పనిచేయాలనుకుంటున్నాను. నేను మరింతగా రాణిస్తాను‘ అని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. మరోవైపు హసన్ అలీకి పాక్ మాజీ క్రికెటర్లు బాసటగా నిలుస్తున్నారు. వసీం అక్రమ్, షోయబ్ అక్తర్, రషీద్ లతీఫ్, ఇంజమామ్ ఉల్ హక్, హసన్ అలీకి మద్దతుగా నిలిచారు.

 

Read more RELATED
Recommended to you

Latest news