తెలంగాణాలో ఈసారి ఎన్నికలు ఎలా ఉన్నాయంటే ఎప్పుడూ ఇలా జరగవు అంటూ రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. ఎందుకంటే కుటుంబ పాలనకు ఎలాగైనా స్వస్తి చెప్పాలని కరెస్, బీజేపీలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక అందులో భాగంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార ప్రభుత్వంపై మెరియు సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సరైన విమర్శలు చేశాడు. ఖైరతాబాద్ రోడ్ షో లో మాట్లాడిన రేవంత్ రెడ్డి కేసీఆర్ ను చూసి బడికి వెళ్లే పిల్లలు కూడా తాగడానికి అలవాటు చేసుకున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చేశారంటూ ఆవేదనను వెళ్లగక్కారు. శాసనసభకు వెళ్లే ఆడవారి సంఖ్య చాలా తగ్గిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.
అందుకే ప్రభుత్వం మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ రేవంత్ రెడ్డి ప్రజలకు కాంగ్రెస్ కు మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలి అంటూ కోరారు. మరి ప్రజలు ఎవరిని గెలిపిస్తారన్నది తెలియాల్సి ఉంది.