సజ్జల నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు: పయ్యావుల

చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇస్తూ నేడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సీఐడీకి, వైసీపీ ప్రభుత్వానికి, చంద్రబాబు తప్పుచేశాడని పదే పదే మీడియా ముందు చౌకబారు ఆరోపణలు చేసేవారికి చెంపపెట్టు అంటూ టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. చంద్రబాబుకు బెయిల్ లభించిన అనంతరం ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. పయ్యావుల తన నివాసం నుంచి జూమ్ ద్వారా మాట్లాడారు.

Will Payyavula Keshav fall for YSRCP mind-game

మేము ఇన్నాళ్లూ చేసిన వాదనలనే బెయిల్ తీర్పులో కోర్టు ప్రస్తావించిందని పయ్యావుల పేర్కొన్నారు. స్కిల్ కేసులో మొదటి నుంచి చివరి వరకు చంద్రబాబు కనుసన్నల్లో ఉన్నట్టుగా సీఐడీ చిత్రీకరించిందన్నారు. సీఎంగా ఉన్న చంద్రబాబుకి ఏమీ సంబంధం లేదనే రీతిలో కోర్టు వ్యాఖ్యానించిందన్నారు. సీఐడీ చేసిన ఆరోపణలకు, అభియోగాలకు ఆధారాలు చూపలేదని కోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. అసలు ఆధారాలుంటే కదా చూపడానికి..? అని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ అకౌంట్ లోకి స్కిల్ కేసు డబ్బులు వచ్చాయని కూడా ప్రాథమిక ఆధారాలు కూడా చూపలేదని కోర్టు అభిప్రాయపడిందని పయ్యావుల అన్నారు.