వరి కొనకపోతే…కెసిఆర్ మోడీని ఉరి తీస్తాం : రేవంత్

వరి కొనకపోతే…అంబేద్కర్ చౌరస్తాలో కెసిఆర్ మోడీని ఉరి తీస్తామని.. ఇది ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. 10 వేల కోట్లు మాకు ఇవ్వు… ధాన్యం అంతా కొంటామని టిఆర్ఎస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. విదేశాలకు ఎగుమతి చేస్తామన్నారు. ఇవాళ ఆయన కాంగ్రెస్ మౌన దీక్షలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతు.. తాను..కోమటిరెడ్డి..ఉత్తమ్ అందరం ఇందిరా పార్క్ లోనే ఉంటామని.. కాంగ్రెస్ కార్యకర్తలు అంతా రండి..రైతులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ లో మోడీ చొక్కా పట్టి నిలదీస్తామని.. వైన్ షాప్ టెండర్ ల కు వచ్చిన దాంట్లో సగం డబ్బులు పెట్టినా… రైతు ధాన్యం కొనొచ్చన్నారు. బీజేపీ..టిఆర్ఎస్ వేరు వేరు కాదని.. ఇద్దరు తోడు దొంగలేనని ఫైర్ అయ్యారు. రైతులు గిట్టుబాటు ధర…అదనంగా బోనస్ కూడా ఇస్తామని.. ఇవ్వలేక పోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు ఆడగమన్నారు. కల్లాల్లో రైతులు చనిపోతే… కెసిఆర్ కండ్లు కాకులు పొడిచాయా..? అని ప్రశ్నించారు.