కెసిఆర్ గడీలు కూల్చుతాం…మిమ్మల్ని గుంజలకు కడతాం : రేవంత్‌ ఫైర్‌

కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖాసిం రిజ్వి లాగా వ్యవస్థ మారిందని… తెలంగాణ లో స్వేచ్ఛ కోసం కెసిఆర్ గడీలు కూల్చేస్తామని హెచ్చరించారు. 18 నెల్ల తర్వాత.. తెలంగాణ లో సోనియా రాజ్యం రాబోతుందని…సోమేష్, అరవింద్, ప్రభాకర్ రావు వీళ్లందరిని… గుంజలకు కడతామని పేర్కొన్నారు.

revanth-reddy-cm-kcr

దోచుకున్నవి కక్కిస్తామని…తీసుకున్నవి మొత్తం తిరిగి గుంజు కుంటమన్నారు. మేము అధికారం లోకి వచ్చాక స్వాధీనం చేసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. గచ్చిబౌలి లో కేటీఆర్ భార్య శైలిమ, సీమ, సుష్మ శ్రీ లకు అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిని రెగ్యులర్ చేశారని… తేలుకుంట్ల శ్రీధర్ ఆ వ్యవహారాలు చక్కబెట్టారని ఆరోపించారు. అదే తేలుకుంట్ల శ్రీధర్ నుంచి శైలిమ అకౌంట్ లోకి 7కోట్ల రూపాయలు వచ్చాయని… భూములు కొన్న వర్శిటీ కంపెనీలో సీమ, సుష్మ శ్రీ లు డైరెక్టర్ లుగా ఉన్నారని తెలిపారు.. భూములు కొన్న మరో కంపెనీ ప్రెస్టేజ్ తో కేటీఆర్ కు లావాదేవీలు ఉన్నాయని… దోపిడీకి కొత్త తరహా విధానం కనుగొన్నారని ఆరోపించారు. తక్కువ ధరకు భూములు కట్టబెట్టి డెవలప్ మెంట్ ను తమ బంధువులకు ఇస్తున్నారని… డెవెలప్ మెంట్ రూపంలో కమిషన్ పొందుతున్నారని మండిపడ్డారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామి రెడ్డి ఓ ల్యాండ్ మాఫియా లీడర్ అని… ఈ ప్రోక్యుర్మెంట్ లో కాకుండా ఎంఎస్పీసి విధానంలో ఎందుకు భూములు అమ్మారని విమర్శించారు.