రేవంత్ రెడ్డి ఏడవ రోజు పాదయాత్ర వెల్దండ మండలం , గొల్లోనిపల్లి,చౌదరి పల్లి,రఘాయి పల్లి గుండా ఆమన్గల్ కు చేరుకుంది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ నరేంద్రమోదీ పార్లమెంట్ ప్రవేశ పెట్టిన మూడు చట్టాలను వ్యతిరేకంగా రాజీవ్ రైతు భరోసా యాత్ర చేస్తున్నానని అన్నారు. పేదలకు భూములను పంచి పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందన్న ఆయన ఆదానీ,అంబానీలకు దేశాన్ని కట్టబెట్టిన దేశ ప్రధాని నరేంద్రమోడీ అని అన్నారు.
మూడు చట్టాలను వ్యతిరేకంగా ఉన్న కేసీఆర్ ఎందుకు వెనక్కి తగ్గారు అని రేవంత్ ప్రశ్నించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు రాజీవ్ రైతు భరోసా యాత్ర చేస్తున్నానన్న ఆయన ఢిల్లీ సరిహద్దుల్లో చేస్తున్న రైతు దీక్ష కు మద్దతు తెలుపుతున్నామని అన్నారు. 16 తేదీన రావిరాల దగ్గర ముగింపు సభకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రేవంత్ ఈ సందర్భంగా కోరారు.