తెలంగాణలో పేద పిల్లల చదువులకు చంద్ర గ్రహణం పట్టింది అంటూ ట్వీట్ చేశారు టి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఉపాధ్యాయులు లేక, పాఠ్యపుస్తకాలు లేక పాఠశాలలు వెలవెలబోతున్నాయని తెలిపారు.’ మన ఊరు – మన బడి’ ఓ ప్రచార ఆర్భాటమని మండిపడ్డారు. ప్రశ్నించకపోతే తెలంగాణ అజ్ఞానాందకారం లోకి వెళ్లడం ఖాయమని అన్నారు. బై బై కేసీఆర్ అనే హాష్ ట్యాగ్ నీ జతచేస్తూ… ఓ వీడియోని షేర్ చేశారు.
ఆ వీడియోలో ఉపాధ్యాయులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.” నీళ్లు, నిధులు, నియామకాలు అన్న కేసీఆర్.. నీ ప్రగల్బాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 2017 లో డిఎస్సి వేసి, కేవలం ఎనిమిది వేల పోస్టులు డిక్లేర్ చేశారని, వాటిని 2019 లో ఉద్యోగాలు వేశారని అన్నారు. ఇప్పటికీ ఇంకా 11 వేల ఉద్యోగాలు రాలేదని మండిపడ్డారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో.. కొట్లాడితే వనికే పరిస్థితి, పోరాడితే వనికే పరిస్థితి ఏర్పడిందన్నారు.
తెలంగాణలో పేద పిల్లల చదువులకు ‘చంద్ర’గ్రహణం పట్టింది.
ఉపాధ్యాయులు లేక, పాఠ్యపుస్తకాలు లేక పాఠశాలలు వెలవెలబోతున్నాయి.
‘మన ఊరు – మన బడి’ ఓ ప్రచారార్భాటం.ప్రశ్నించకపోతే తెలంగాణ అజ్ఞానాంధకారంలోకి వెళ్లడం ఖాయం.#KCRFailedTelangana #ByeByeKCR pic.twitter.com/T4JDT9gMbp
— Revanth Reddy (@revanth_anumula) July 13, 2022