జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయనకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు వేద ఆశీర్వాదం ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భక్తి ముసుగులో ఒకరు, అభివృద్ధి ముసుగులో మరొకరు దోచుకుంటున్నారని ఆరోపించారు.
కొండగట్టుకు తక్షణం 500 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. తండ్రి, కొడుకు, కూతురు రాజకీయాల ముసుగులో దేవుళ్లను మోసం చేశారని ఆరోపించారు. ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తీసుకొని నాలుగు కోట్ల ప్రజలకు మేలు జరిగాలని కోరుకున్నానని తెలిపారు రేవంత్ రెడ్డి. కవిత హనుమాన్ చాలీసా పారాయణ చేసి 125 అడుగుల విగ్రహం కట్టిస్తానని మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండగట్టును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.