ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సెకండ్ కు ఒక మొబైల్ తయారవుతుందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. మొబైల్ చార్జర్ల వైర్లు, బ్యాక్ కెమెరాల పార్ట్స్, హెడ్ ఫోన్ వైర్లు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ తో పోటీ పడగలిగే స్థాయి ఒక్క విశాఖ నగరానికి మాత్రమే ఉందన్నారు మంత్రి అమర్నాథ్. రాష్ట్రానికి ఆనుకొని ఉన్న ప్రధాన నగరాలైన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలతో అనుసంధానం చేస్తూ.. కారిడార్ల డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్నామని అన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడుల కోసం 14 రంగాలను ఎంపిక చేసుకుని ఫోకస్ చేయాలని నిర్ణయించామని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉన్న వనరులు, మౌలిక వసతుల గురించి ప్రచారం చేయలేదని విమర్శించారు. దేశం గర్వపడే ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ధనవంతులు సీఎం జగన్ గురించి ఎంత బాగా చెప్పారో విశాఖ సదస్సులో చూశామన్నారు.