వామనరావు వాదిస్తున్న కేసులు సీబీఐకి ఇవ్వాలి : రేవంత్ రెడ్డి

Join Our Community
follow manalokam on social media

తెలంగాణలో సంచలనంగా మారిన వామన రావు దంపతుల హత్యను దేశమంతా గమనిస్తోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకుల అవినీతి అక్రమాల మీద వివిధ కోర్టులలో కేసులు వేసి వామనరావు పోరాడుతున్నారని అన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని జరుపుకుని వచ్చి పట్టపగలే టీఆర్ఎస్ నేతలు హత్య చేశారని ఆయన అన్నారు.

ఈ నెలలోనే కేసీఆర్, కేటీఆర్, బాల్క సుమన్ లు కార్యకర్తలను రెచ్చగొట్టారని రేవంత్ అన్నారు. వామనరావు పోలీసు రక్షణ కోరినా ఆయనకు ఇవ్వలేదని రేవంత్ విమర్శించారు. ఈ కేసులో  కేసీఆర్, కేటీఆర్, బాల్క సుమన్ ల పేర్లు చేర్చాలని ఆయన అన్నారు. వారి ఆదేశాల మేరకే ఈ హత్య జరిగిందని అన్నారు. వారందరినీ కుట్రదారులుగా 120బీ కింద కేసులు నమోదు చేయాలని అన్నారు. అలానే వామనరావు వాదిస్తున్న దాదాపు 17 కేసులను సీబీఐకి అప్పగించాలని అయన డిమాండ్ చేశారు. అలానే బీజేపీ పెద్దలు కూడా ఈ అంశం మీద ద్రుష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

TOP STORIES

రూపాయి ఫీజు.. రిటైర్డ్ టీచర్ క్లాస్..!

రిటైర్‌మెంట్ తీసుకున్న ఉద్యోగులు వృద్ధాప్య జీవితాన్ని ఏదోఒక కాలక్షేపంతో కానిచ్చేస్తుంటారు. మనవళ్లకు ఆటపాటలు నేర్పిస్తూ కాలం గడుపుతుంటారు. కానీ బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన 61ఏళ్ల లోకేశ్...