షర్మిల పార్టీ పై మంత్రి గంగుల దూకుడు అందుకేనా

Join Our Community
follow manalokam on social media

తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై షర్మిల వేగంగా పావులు కదుపుతున్నారు. ఇక పార్టీ నిర్మాణం, ఏర్పాటు చేసిన తర్వాత ఎలా ముందుకు సాగాలనే దానిపై దృష్టిపెట్టారు. కొత్త పార్టీ హడావిడి తెలంగాణలో ఇలా కొనసాగుతున్న వేళ అధికార టిఆర్ఎస్ పార్టీ నేతలు వైఎస్ షర్మిల పార్టీ పై ఆచితూచి స్పందిస్తున్నారు. చాలా మంది నేతలు ఈ అంశంపై మాట్లాడడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ ఎవరూ మాట్లాడకపోయినా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మాత్రం వైఎస్ షర్మిల పార్టీపై వరుసగా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.

లోటస్ పాండ్ లో పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు షర్మిలతో భేటీ అవుతున్నారు. షర్మిల పార్టీ పై మిగిలిన రాజకీయ పార్టీల నేతలు ఆచితూచి స్పందిస్తూ ఉంటే..గంగుల కమలాకర్ షర్మిలను వరుసగా టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఇప్పడు హాట్ టాపిక్ అయ్యింది.ఇప్పడు జగనన్న బాణం షర్మిల వస్తోంది..తర్వాత జగన్, ఆ తర్వాత చంద్రబాబు వస్తారని అప్పుడు తెలంగాణలో కొట్లాటలు తప్పవని అంటున్నారు.

అన్న,చెల్లి మధ్య గొడవ ఉంటే మీరు మీరు చూసుకోవాలని తెలంగాణలో పార్టీ ఎందుకంటూ కామెంట్స్ చేశాడు మంత్రి కమలాకర్. ఆంధ్రపెత్తనం వస్తే మళ్లీ కష్టాలొస్తాయనే సెంటిమెంట్ కామెంట్స్ సైతం గంగుల నోటి నుంచి వచ్చాయి. కెసీఆర్‌ని మనం కాపాడుకోవాలని, లేకపోతే ఇబ్బందులు వస్తాయని బహిరంగ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలన్నీ గంగుల కమలాకర్‌ వ్యక్తిగతంగా అంటున్నవా లేక దీన్ని టిఆర్ఎస్ పార్టీ లైన్ గా చూడాల్సి ఉంటుందా అన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోందట.

దీంతో రానున్న రోజుల్లో వైఎస్ షర్మిల పార్టీ పై అధికార పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో అనే ఆసక్తి ఏర్పడింది.

 

 

TOP STORIES

ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఫ్రీ….రూ.5 లక్షల ఇన్స్యూరెన్స్ ని ఎలా పొందాలంటే…?

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన నుండి ప్రయోజనంకల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఎవరైనా ఆయుష్మాన్...