కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరదీసిందని… దీనివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం పడబోతోందని బాంబ్ పేల్చారు బండి సంజయ్. కరీంనగర్ లో బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించి… మాట్లాడుతూ….అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే అంశంపై అసెంబ్లీలో చర్చ జరపాల్సిందేనన్నారు.
అసెంబ్లీ బడ్జెట్, కాంగ్రెస్ 6 గ్యారంటీలు = గాడిద గుడ్డే….. 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు = గాడిద గుడ్డే అంటూ చురకలు అంటించారు. కేసీఆర్ బాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం… 6 గ్యారంటీలను అమలు చేయలేక కేంద్రాన్ని బదనాం చేసే కుట్ర… కేసీఆర్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు తప్పదని హెచ్చరించారు. నీతి అయోగ్ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి డుమ్మా కొట్టడం దుర్మార్గమని ఆగ్రహించారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి నడస్తున్నట్లుందని నిప్పులు చెరిగారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్.