ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల సినిమాటోగ్రఫీ యాక్ట్ బిల్లుని ప్రవేశపెట్టే సమయంలో ఏపీ మంత్రి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. సినిమా బడ్జెట్ లో హీరోల రెమ్యూనరేషన్ ఎక్కువగా ఉంటుందని, దానివల్ల సినీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు నష్టం కలుగుతుందని చెప్పుకొచ్చారు. దీనిపై చిరంజీవి కౌంటర్ కూడా వేశారు. తీరా అది కాస్త వివాదంగా మారింది. తాజాగా ఈ కాంట్రవర్సీ పై వర్మ రియాక్ట్ అవుతూ.. హీరోలకు కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడం తప్పు కాదు.
వాళ్ళకి మార్కెట్ ఉంది కాబట్టి, వారివల్ల కలెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇస్తున్నారు. అలా నాకు ఇస్తే నేను కూడా తీసుకుంటాను. రెమ్యూనరేషన్ ఎక్కువ ఇవ్వడం వల్ల దాన్ని తిరిగిరాబట్టుకోవడం కోసం టికెట్ రేట్స్ పెంచాల్సి వస్తుంది. ఆ భారం ప్రజలపై పడుతుందనుకోవడం కూడా పూర్తిగా తప్పు. వారికి నచ్చితే చూస్తారు.. లేదా చూడరు. ఇతర భాషల్లో 20-40 కోట్లతో సినిమాలు తీస్తున్నారు. తెలుగులో ఎక్కువ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు అంటే.. తెలుగు సినిమాలు, స్టార్స్ కి ఉన్న మార్కెట్ వేరు” అంటూ చెప్పుకొచ్చాడు వర్మ. ప్రస్తుతం వర్మ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇది ఇలా ఉంటె, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావును ఉద్దేశించి ఓ ఫొటోను పోస్టు చేశాడు. చేతిలో మిక్కిమౌస్ బొమ్మను పట్టుకున్న ఫొటోను పోస్టు చేసిన ఆర్జీవీ.. దేవినేని ఉమా ట్విట్టర్ ప్రొఫైల్‌ను ట్యాగ్ చేశాడు. అక్కడితో ఆగకుండా చివర్లో ఓ కిస్ ఎమోజీని పెట్టాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇటీవల ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణను టార్గెట్ చేశారు ఆర్జీవీ. ట్విట్టర్ వేదికగా ఆయనపై నిప్పులు చెరిగారు. దీంతో ఇప్పుడు ఆర్జీవీ వర్సెస్ తెలుగుదేశం అన్నట్లుగా పరిస్థితి మారింది.