చంద్రబాబుకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన RGV.. “సైకో.. సిక్కో” కథని వినండి..

-

నేడు తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు. నేటితో 73వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చంద్రబాబు జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాలలో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు నాయకులు.

కేక్ కటింగ్, రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. అలాగే అన్నదానాలతో పాటు ఆసుపత్రులలో రోగులకు పండ్ల పంపిణీ చేస్తున్నారు. అన్ని పార్టీల నేతలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, చంద్రబాబు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లోకెక్కే రామ్ గోపాల్ వర్మ.. చంద్రబాబు నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అంతేకాదు ఆయనకి ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ని కూడా ఇచ్చారు. “సిక్కో.. సైకో” అనే పాటని చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్ గా ఇచ్చారు రాంగోపాల్ వర్మ. ఇందులోని ప్రత్యేకత ఏంటంటే లిరిక్స్, వాయిస్, మ్యూజిక్.. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ ద్వారా క్రియేట్ చేసినవే. ఈ పాటని మీరు కూడా వినండి.

Read more RELATED
Recommended to you

Latest news