బ్రోకర్లందరికీ శుభా కాంక్షలు : రాజా సింగ్ వివాదస్పద వ్యాఖ్యలు

-

దేశ ప్రధాని నరేంద్ర మోడీ రైతుల చట్టాల రద్దుపై ఇవాళ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే… ప్రధాని మోడీ చేసిన ఆ ప్రకటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ రైతు చట్టాలు రద్దు చేశారని… బ్రోకర్ లకు శుభాకాంక్షలు అంటూ రాజా సింగ్‌ ఫైర్‌ అయ్యారు.


రైతులకు మేలు జరగాలనే ప్రధాని నరేంద్ర మోడీ ఈ చట్టాలు తీసుకొచ్చారన్నారు.. పంట అమ్ముకుంటే రైతులకు లాభం రావాలి కానీ బ్రోకర్ లకు కాదని ఈ చట్టాలు తీసుకొచ్చారని వెల్లడించారు రాజా సింగ్‌. అన్నదాతలు బ్రోకర్ల మాట నమ్మారని… నిరసనల వెనుక బ్రోకర్ లు ఉన్నారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నిధులు వారే ఇచ్చారు… సారా ప్యాకేట్స్ ఇచ్చారు అంత మనము చూశామని రాజా సింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు. దేశ వాతావరణంపాడు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ గమనించారని వెల్లడించారు. రైతులే రాబోయే రోజుల్లో రైతు చట్టాలు కావాలని మోడీ ని కోరుతారని.. బ్రోకర్ లకు బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news