RGV :చంద్రబాబు కంటతడి పై ఆర్జీవీ సెటైర్లు.. మామూలుగా లేవుగా !

-

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడూ ఏదో ఓ విషయంపై ఏదో ఒక ట్వీట్ చేస్తూ… వివాదాలకు తెర లేపుతున్నారు ఈ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ పై సినిమాలు చేయడమే కాకుండా… రెగ్యులర్ గా అక్కడి రాజకీయాలపై కామెంట్ చేస్తూ ఉంటారు రామ్ గోపాల్ వర్మ.

అయితే తాజాగా ఇవాళ చంద్రబాబు ఏడ్చిన సంఘటనపై తన స్టైల్లో రామ్ గోపాల్ వర్మ స్పందించారు. తన ఆర్జీవి మిస్సింగ్ ట్రైలర్ చూసి… తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బోరున ఏడ్చారు అంటూ రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. అంతేకాదు చంద్రబాబు ఏడ్చిన వీడియో నాకు ఆర్జివి మిస్సింగ్ ట్రైలర్ లింకును చెక్ చేసి మరీ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు వర్మ. ఇక ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అటు టిడిపి ఫ్యాన్స్ మాత్రం వర్మ ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news