కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేపు ’కిసాన్ విజయ్ దివాస్‘

-

మూడు సాగు చట్టాల రద్దుపై  కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు దీన్ని రైతుల విజయంగా అభివర్ణించారు. ప్రజా ఉద్యమాలకు ఎవరైనా తలొగ్గాల్సిందే అంటూ ట్విట్టర్ లో పోస్టులు కూడా పెట్టారు. అయితే ఈ నిర్ణయాన్ని మరింత ముందుగా తీసుకుంటే అన్నదాతల ప్రాణాలు మిగిలేవని బీజేపీ తీరును కాంగ్రెస్ విమర్శించింది. బీజేపీ వల్లనే దాదాపు ఏడాది కాలంలో 700 మంది దాకా రైతులు మరణించారని విమర్శించింది.

ఇదిలా ఉంటే రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ’ కిసాన్ విజయ్ దివాస్ ‘ కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది. నల్ల చట్టాలకు వ్యతిరేఖంగా రైతుల చేసిన నిరసన, ధర్నాలకు మద్దతుగా, రైతుల పోరాటానికి గుర్తుగా రేపు దేశవ్యాప్తంగా కిసాన్ విజయ్ ర్యాలీలు, కిసాన్ విజయ సభలు నిర్వహించాలని రాష్ట్ర యూనిట్లను ఆదేశించింది. 

Read more RELATED
Recommended to you

Latest news