ప‌వ‌న్ భ‌క్తుడిగా రామ్‌ గోపాల్ వ‌ర్మ..!

-

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘పవర్ స్టార్’ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో వర్మ కనిపించనున్నారట. క‌మెడియ‌న్‌గా స్టార్ట్ అయ్యి నిర్మాత‌గా మారిన బండ్ల గ‌ణేశ్ పాత్ర‌ను ఆర్జీవీ పోషించ‌బోతున్నాడని తెలుస్తుంది. ‘అన్నా నువ్వు దేవుడివన్నా, వచ్చే ఎన్నికల్లో విజయం మనదే.. నీకు తిరుగులేదు’ అంటూ డైలాగ్‌తో బండ్ల గ‌ణేశ్ పాత్ర‌లో ఆర్జీవీ సంద‌డి చేయ‌బోతున్నాడ‌ని టాక్‌. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఒక్కో పోస్టర్ విడుదల చేస్తూ సంచలనం రేపుతున్నాడు.

పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్‌ను కొట్టినట్టు విడుదల చేసిన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు చిరంజీవి, నాగబాబుతో పాటు పలువురు నటీనటీలకు సంబంధించిన పోస్టర్స్ కూడా రిలీజ్ చేసి ఈ సినిమాపై ఆసక్తికలిగేలా చేసాడు. కాగా, ఇప్పుడు బండ్ల గణేష్ వంటి కమెడియన్ కమ్ నిర్మాత పాత్రను వర్మ పోషిస్తే తెరపై ఎలా ఉంటుందో అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news