న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పేవారంతా ఇడియట్సే : రామ్‌ గోపాల్‌ వర్మ

-

టాలీవుడ్‌ సంచలన డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ గురించి.. ప్రత్యేకంగా… చెప్పనక్కర్లేదు. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. ఎప్పుడూ ఏదో ఓ విషయం పై ఏదో ఓ ట్వీట్‌ చేస్తూ… వివాదాలకు తెర లేపుతుంటారు.. దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ పై సినిమాలు చేయడమే కాకుండా… రెగ్యులర్ గా అక్కడి రాజకీయాలపై కామెంట్ చేస్తూ ఉంటారు రామ్ గోపాల్ వర్మ.

అయితే.. తాజాగా దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.. న్యూ ఇయర్‌ పై ఎప్పటి లాగే.. సంచలన ట్వీట్‌ చేశారు. న్యూ ఇయర్‌ శుభా కాంక్షలు చెప్పే వారంతా పెద్ద ఇడియట్స్‌ అని ట్వీట్‌ చేశారు. “ఏ సంవత్సరం సంతోషంగా ఉండదు. అయినప్పటికీ…. కొంతమంది ఇడియట్స్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతారు. కొత్త సంవత్సరం ఏం కొత్తగా ఉండదు. పాత ఏడాదిలో ఉన్న సమస్యలే.. ఈ కొత్త ఏడాదిలో వస్తాయి. దీంతో ఈ కొత్త సంవత్సరం కూడా విషాదంగా మారుతుంది.” అంటూ ట్వీట్‌ చేశారు వర్మ. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news