Rise in flood outflow from Prakasam barrage: రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ కి వరద విపరీతంగా వస్తోంది. దీంతో విజయవాడ నగరవాసులు కాస్త ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ కు భారీగా వరద వచ్చిన నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు అధికారులు.

అటు మొత్తం 70 గేట్లు ఎత్తివేసి… దిగివకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక అటు విజయవాడలో డ్రైనేజీ సిస్టం సరిగ్గా లేక నీళ్లు అన్నీ రోడ్ల మీదకి వచ్చాయి బాంబు పేల్చారు ఏపీ మంత్రి నారాయణ. విజయవాడ నగరంలో మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటన చేశారు. భారీ వర్షంతో జలమయమైన ప్రాంతాలు పరిశీలించిన ఏపీ మంత్రి నారాయణ…. విద్యాధరపురం,బుడమేరు వంతెన,గాయత్రి నగర్ ప్రాంతాల్లో పరిస్థితి నీ పరిశీలించారు.
ప్రకాశం బ్యారేజ్‌కు కొనసాగుతున్న వరద
మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు… మొత్తం 70 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల. pic.twitter.com/L5xtfBhmGM
— greatandhra (@greatandhranews) August 13, 2025