ప్రముఖ షెఫ్ సంజయ్ రైనా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను కలిశారు. ఆయనతో తీసుకున్న ఓ వీడియోను ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. రిషి, రైనాలు.. ఫోన్లో వేరే ఇతర వ్యక్తితో వీడియో కాల్లో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. అవతలి వ్యక్తిని రిషి ‘విజయ్ మామ’ అని పలకరించడంతో అసలు ఆయన ఎవరనే దానిపై నెటిజన్లలో చర్చ మొదలైంది. ఈ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
‘మామ.. మీకు హలో చెప్పేందుకు ఎవరు ఉన్నారో చూడండి’ అంటూ సంజయ్ తన ఫోన్‌ను రిషి సునాక్‌వైపు తిప్పారు. దీంతో సునాక్ ఆయన్ను ‘విజయ్ మామ’ అని పలకరించారు. ‘విజయ్ మామ.. హాయ్. నేను రిషి. ఎలా ఉన్నారు? మీరు నన్ను కలుస్తారని ఆశిస్తున్నా. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు, మీ మేనల్లుడి(సంజయ్)ని.. డౌనింగ్ స్ట్రీట్‌కు తీసుకెళ్లమని చెప్పండి. టేక్ కేర్’ అని మాట్లాడారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన సంజయ్.. ‘వీసా ఆన్ అరైవల్ అబ్ పక్కా’ అని క్యాప్షన్ ఇచ్చారు.
Visa on arrival ab pakka 😊😊#RishiSunak pic.twitter.com/imSIhuEgKB
— Sanjay Raina (@sanjayraina) October 27, 2022