బ్రెకింగ్: సిద్ధిపేట కలెక్టర్ వెంకట్ రామ్ రెడ్డి రాజీనామా…! త్వరలో టీఆర్ఎస్ లో చేరే అవకాశం..!

-

సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన కలెక్టర్ పదవికి రాజీనామ చేశారు. సీఎస్ సోమేష్ కుమార్ కు తన రాజీనామా లేఖను అందించారు. రాజీనామా అనంతరం త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. వెంకట్రామి రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది తెలంగాణలో కొత్త రాజకీయ పరిణామాలకు దారి తీసింది.

గతంలో సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో కలెక్టర్ గా పనిచేశారు. ఉమ్మడి ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఆర్డీఓగా సేవలు అందిచారు.

ఇటీవల వరిధాన్యాన్ని అమ్మవద్దని వ్యాపారులను హెచ్చరించడం, రైతులు ఎవ్వరూ వరి ధాన్యాన్ని సాగు  చేయవద్దని హెచ్చరించడంతో పాటు… వ్యాపారులు సుప్రీం కోర్ట్ నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా వదలేది లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈవ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా పరిగణించి విమర్శలు చేశాయి. కలెక్టర్ టీఆర్ఎస్ తొత్తుగా మారారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శించాయి. కలెక్టర్ వ్యాఖ్యలపై హై కోర్ట్ కూడా అక్షింతలు వేసింది. గతంలో సిద్దిపేట కలెక్టరేట్ ఓపెనింగ్ సమయంలో సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడం కూడా వివాదాస్పదం అయింది.

Read more RELATED
Recommended to you

Latest news