విడాకుల తీసుకునే వారి సంఖ్య ఇండియాలో తక్కువే..అంటే అందరూ ఆనందంగా ఉన్నారనికాదు: ఎన్సీఆర్బీ

-

సంప్రదాయాలకు పెట్టింది పేరు ఇండియా. సెంటిమెంట్స్, ఎమోషన్స్, రిలేషన్స్ ఇలా అన్నింటికి చాలా విలువను ఇస్తాం. పెళ్లి అంటే ప్రతిమనిషి జీవితంలో వచ్చే పెద్ద టర్నింగ్ పాయింట్. ఒక్కసారి పెళ్ళయ్యాక..ఇక ఆ మహిళ కష్టమైనా, నష్టమైన సరే ఆ జీవితభాగస్వామితోనే ఆఖరిక్షణం వరకూ బతకాలి అనుకుంటారు. అయితే అందరూ ఇలానే ఉంటారని కాదు..కానీ మెజారిటీ ఈ ధోరణిలోనే ఉంటారు. ప్రోగ్రెస్ ఆఫ్ ది వరల్డ్స్ ఉమెన్ నివేదిక ప్రకారం, ఇండియాలో విడాకుల రేటు 2010నాటికి 45-49 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో కేవలం 1.1 శాతం మాత్రమే విడాకులు తీసుకున్నట్లు తేలింది.

అయితే విడాకుల తీసుకోలేదు అంటే..అందరూ వారి జీవితభాగస్వామితో సంతోషంగా ఉన్నారని అని కాదు.NCRB నివేదిక ప్రకారం మ్యారేజ్ లో సంతోషంగా లేనివారు విడాకుల కంటే మరణాన్నే ఎంచుకుంటున్నారు వెల్లడైంది. ఎన్స్ఆర్పీ గతనెలలో విడుదల చేసిన నివేదిక ప్రకారం… 2016 మరియు 2020 మధ్యకాలంలో వైవాహిక సమస్యల కారణంగా సుమారు 37,591 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అంటే సగటున రోజుకు 20 మంది అనమాట.

వీరిలో విడాకులు 2,688 మందిని (మొత్తం 7 శాతం మంది) తమ జీవితాలను ముగించేలా చేశాయని తేలింది. అంటే విడాకులు తీసుకోకుండా సమస్యల కారణంగా ఆత్మహత్యల ద్వారా మరణించిన వారి కంటే 13 రెట్లు ఎక్కువ.‘వివాహ సంబంధిత సమస్యల’ కారణంగా ఆత్మహత్య చేసుకున్న మహిళల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉందని నివేదిక చెబుతుంది.

పెళ్లితరువాత సూసైడ్ చేసుకోవటానికి కారణాలేంటి?

వరకట్నం – వరుడి కుటుంబం వధువు కుటుంబం నుండి డబ్బు మరియు ఇతర భౌతిక ప్రయోజనాలను డిమాండ్ చేసే చట్టవిరుద్ధమైన ఆచారం. ఈ సమస్యతోనే ఎంతో మంది వివాహితలు ఆత్యహత్యలు చేసుకుంటున్నారు. వరకట్నం కారణంగా ప్రతి సంవత్సరం సగటున 2,056 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అయితే వివాహాల్లో సమస్యలు పరిష్కరించని వారి సంఖ్య సంవత్సరానికి 2,100 మందిగా తేలింది..వివాహేతర సంబంధాల కారణంగా సంవత్సరానికి 1,100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఐదు సంవత్సరాలలో మొత్తం 5,737 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది గీతా లూత్రా ఆత్మహత్యలకు ప్రధాన కారణం..డిప్రెషన్ అని పేర్కొన్నారు. అయితే దీన్ని ఎవరూ పెద్దగా నమ్మరు కూడా. అవును డిప్రెషన్ తో చనిపోయారు అంటే..సమాజం నమ్మదు, అసలు కారణం ఏదో ఉంది అనే కోణంలోనే ఆలోచిస్తుంది. ఆమె ఇంకా వివాహాలకు సంబంధించిన ఇచ్చే కౌన్సిలింగ్ కూడా సరిగా లేకపోవటం కూడా ఒక కారణం అనే పేర్కొన్నారు. అంటే..ఒకవేళ మీకు నచ్చిన వ్యక్తిని పెళ్లిచేసుకుని 24గంటలు ఆ బాధను భరించాల్సి రావటం ఎంత నరకం. ఈ బాధను భరించలేకే వాళ్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అనటంలో సందేహం ఏం లేదు.

జాతివ్యత్యాసం

పురుషుల కంటే ఎక్కువ మంది స్త్రీలు వివాహ సంబంధిత సమస్యలతో మరణిస్తున్నారని మొత్తం సంఖ్యలు సూచిస్తున్నప్పటికీ, స్త్రీలలో వరకట్న సంబంధిత మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో ఈ సంఖ్యలు వక్రీకరించబడ్డాయి.

2016 మరియు 2020 మధ్య కాలంలో వివాహ సంబంధిత కారణాలతో ఆత్మహత్య చేసుకున్న మొత్తం మహిళల సంఖ్య 21,570 కాగా పురుషుల సంఖ్య 16,021 తేలింది. గత ఐదేళ్లలో 9,385 మంది మహిళలు, అంటే సంవత్సరానికి 1,877 మంది లేదా ప్రతిరోజూ ఐదుగురు మహిళలు ఆత్మహత్యలకు వరకట్నంమే కారణం అవుతుంది.

2020లో 7,239 వివాహ సంబంధిత ఆత్మహత్యల్లో, దాదాపు 2,018 (26 శాతం) వరకట్న సంబంధిత సమస్యల కారణంగా జరిగాయి. వీరిలో 1,749 మంది మహిళలు, 249 మంది పురుషులు ఉన్నారు. అంతకుముందు సంవత్సరం, వరకట్న సంబంధిత మరణాల సంఖ్య 3 శాతం తక్కువగా ఉంది, 1,956.

ఇతర వివాహ-సంబంధిత కారణాలు అంటే వివాహేతర సంబంధాలలో స్త్రీల కంటే ఎక్కువ మంది పురుషులే ప్రాణాలను తీసుకుంటున్నారు.

2020లో, విడాకులు కారణంగా 287 మంది పురుషులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 264 మంది మహిళలు అదే సంవత్సరంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే వివాహేతర సంబంధాల విషయంలో 724 మంది పురుషులు ఆత్మహత్య చేసుకున్నారు, అయితే మహిళల సంఖ్య 636 లేదా 14 శాతం తక్కువగా ఉంది.

లూత్రా చెప్పినదాని ప్రకారం.. ఎక్కువ మంది పురుషులు పని లేదా వ్యాపార సంబంధిత ఒత్తిడి లేదా వైఫల్యం కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విడాకులు, వివాహేతర సంబంధాలు, ఇతర వివాహ సంబంధిత సమస్యలు కూడా పురుషుల గౌరవానికి సంబంధించినవిగా మారతాయి. తమ భార్య ఇలా చేసిందని పదిమందికి తెలిస్తే..ఆ భర్త తలెత్తుకోని తిరగలేడు..ఇదే కారణంతోనే పురుషులలో అత్యధిక సంఖ్యలో ఆత్మహత్యలను చేసుకుంటున్నారు.

అయితే మహిళల్లో ఆర్థికంగా మెరుగ్గా ఉన్నవారు..విడాకుల తర్వాత కూడా తమ జీవితాన్ని చక్కగా హ్యాండిల్ చేయగలుగుతారని లూత్రా తెలిపారు.

కౌన్సెలింగ్ వల్ల ఉపయోగం ఉంటుందా?

ఒకవేల విడాకులు వల్ల ఆత్మహత్యలు తగ్గినట్లైతే..మరి ఇంకా చాలామంది ఎందుకు ఇష్టంలేని భాగస్వామితోనే ఉంటున్నారు అనే ప్రశ్న వస్తే దానికి కారణం భయం. భయంతో కదలకుండా ఉండి, చర్యలు తీసుకోవడం లేదా సరైన నిర్ణయాలు తీసుకోవడం మానేసినప్పుడు సమస్య ఇంకా పెరుగుతుందిని ఢిల్లీలోని మెటానోయి అనే సంస్థ వ్యవస్థాపకురాలు రిచా హోరా అన్నారు

ఇంకో కారణం..అప్పటికే పిల్లలు పుట్టి ఉంటారు..కేవలం వారి కారణంగానే వివాహంలో ఉండాలనుకుంటున్నారు.

అయితే ఇలా చేయటం తప్పు అని హోరా అంటున్నారు..మీ భాగస్వామితో ఎప్పడూ గొడవలు జరుగుతుంటే..ఇంకా అదే వ్యక్తితో రిలేషన్ లో ఉండటం మీకు, మీ పిల్లలకు ఏమాత్రం మంచిదికాదని హోరా అంటున్నారు. అయితే ఈరోజుల్లో పెళ్లైన యువతే..కౌన్సిలింగ్ కోసం ముందుంటున్నారని హోరా తెలిపారు.

“పెళ్లయిన రెండు-మూడేళ్ల తర్వాత తమ వైవాహిక జీవితంలో ఏదైనా సంభావ్యత ఉందో లేదో తెలుసుకోవడానికి యువ జంటలు నా దగ్గరకు వస్తుంటాయి అని హోరా అంటున్నారు. అయితే యంగ్ కపుల్ తమకు నచ్చని భాగస్వామితో ఉండేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇష్టపడటం లేదని ఆమె వెల్లడించారు.

ఈరోజుల్లో యువత..చుట్టు ఉన్న ప్రపంచాన్ని, పెళ్లైన వారి కష్టాలను చూసి అబ్బాయిల్లో చాలమంది పెళ్లే వద్దురా బాబూ అనుకుంటున్నారు. 23- 25 వయుసున్న ఏ అబ్బాయిని కదిలించినా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనట్లే చెబుతున్నారు. కానీ 28 ఏళ్లు వచ్చే సరికి చాలామట్టుకు పెళ్లి చేసుకోక తప్పని పరిస్థితి వస్తుంది. ఎదుటి వ్యక్తిని గౌరవించటం, వారి అభిప్రాయాలకు, నిర్ణయాలకు విలువ ఇచ్చి అర్థంచేసుకుంటే దాదాపు పెళ్లి తర్వాత జీవితం కూడా ఆనందంగానే ఉంటుంది.

                                                                                                                  -triveni

Read more RELATED
Recommended to you

Latest news