ట్రావెల్: హైదారాబాద్ నుండి అతి తక్కువ దూరంలో ఆనందించాల్సిన రోడ్ ట్రిప్స్

-

స్నేహితులతో కలిసి కొత్త ప్రాంతాల్లో విహరించడం అనేది సరికొత్త అనుభవం. ఆ ఆనుభూతుల్లో స్నేహం ఇంకా బలపడుతుంది. ఒకరి ఇష్టాలు, అయిష్టాలు తెలుస్తాయి. అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది. ఐతే స్నేహితులతో కలిసి విహరించడానికి రోడ్ ట్రిప్ మంచి ఆప్షన్. మీకు తెలియని కొత్త దారుల్లో కొత్త అనుభవాలను మీ జ్ఞాపకాల్లో నిక్షిప్తం చేసుకోవడానికి అంతకంటే మంచి పర్యటన దొరకదు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీ స్నేహితులతో కలిసి చేపట్టాల్సిన రోడ్ ట్రిప్ ప్రాంతాలు.

నాగార్జున సాగర్

హైదరాబాదు నుండి ఒక్కరోజులో వెళ్ళిరాగలిగే ఈ ప్రాంతం అద్భుత సుందర ప్రకృతి రమణీయతతో కూడుకుని ఉంటుంది. పురాతన బౌద్ధ మతానికి చెందిన మఠాలు సరికొత్త సంస్కృతిని గుర్తు చేస్తాయి. అబ్బురపరిచే జలపాతం, పడవ ప్రయాణం ఆకట్టుకుంటాయి.

కర్నూలు

తుంగభద్ర అంచున ఉన్న ఈ ప్రాంతాన్ని చరిత్ర ఇష్టం ఉన్నవారితో పాటు ఆసక్తి లేని వారు కూడా ఎంజాయ్ చేయవచ్చు. పక్కనే రోళ్ళపాడు పక్షి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించడంతో పాటు ఒరవకళ్ళు రాతి గార్డెన్ ని దర్శించవచ్చు.

ఆదిలాబాద్

జలపాతాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు పర్యటించాలన్న అభిలాష ఉన్నవారు ఆదిలాబాద్ రోడ్ ట్రిప్ వేసుకోవచ్చు. కవ్వాల్, ప్రాణహిత అభయారణ్యాలతో పాటు మావాలా సరస్సు, కుంతాలా జలపాతం చూడదగ్గ ప్రాంతాలు.

గుల్బర్గా.. ఇస్లామిక్ అద్భుతం

ఇస్లామిక్ శైలిలో అత్యద్భుతంగా కట్టిన భవంతులు కలిగిన గుల్బార్గా ప్రాంతాన్ని ఖచ్చితంగా చూడాల్సిందే. నిజాం కాలం నాటి వాస్తుశిల్పంతో సరికొత్త అనుభూతిని పంచే ఈ ప్రాంతం హైదరాబాద్ నుండి 230కిమీ దూరంలో ఉంది. చంద్రం పల్లి డ్యామ్ ట్రెక్కింగ్ తో పాటు జామా మసీదును తలపించే ఎన్నో భవంతులు కనిపిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news