స్కెచ్ వేశారంటే.. పంట పండాల్సిందే… సెల్ ఫోన్ల కంటైనర్ హైజాక్

-

 

హైదరాబాద్: ఏపీ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దులో  కంటైనర్లనే మాయం చేసే ముఠా ఏకంగా ఖాకీలకే సవాల్ విసిరింది. చిత్తూరు జిల్లా సరిహద్దులో మాటు వేసిన ముఠా కంటైనర్లను మాయం చేస్తున్నారు. మరి అది మామూలు ముఠా కాదు,  అంది కంత్రీ కంటైన్ల ముఠా. స్కెచ్ వేశారంటే పంట పండాల్సిందే. చెన్నై, ముంబై, బెంగళూరు హైవేలో ప్రయాణిస్తున్న ఓ మొబైల్ కంటైనర్‌ను ఈ ముఠా తాజాగా హైజాక్ చేసింది. ఒకటి, రెండు కాదు..ఏకంగా ఆరు కోట్ల రూపాయలు విలువ చేసే మొబైల్స్‌ను ఈ ముఠా దోచుకెళ్లింది. కంటైనర్ కాంచీపురం నుంచి బెంగళూరు‌కు వెళ్లుండగా సినీ ఫక్కీలో దోపిడీకి పాల్పడ్డారు.  డ్రైవర్‌ను బెదిరించి సెల్ ఫోన్లతో పాటు కంటైనర్‌ను ఎత్తు కెళ్లారు.

 

కర్ణాటకలోని కోలార్ జిల్లా దేవరాయ సముద్రం వద్ద ఈ ఘటన జరిగింది. బైకపై వచ్చిన ముగ్గురు దుండగులు కంటైనర్‌ను హైజాక్ చేశారు. అయితే విఫలమయ్యారు. ఇదే ముఠా కంటైనర్‌ను హైజాక్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఎమ్ఐ మొబైల్స్ లే టార్గెట్ గా ఈ దోపిడీ ముఠా చోరీకి పాల్పడుతోంది. కాంచీపురం నుంచి వెళ్తున్న కంటైనర్లను ఈ ముఠా దోచుకుంటుందోని పోలీసులు అంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news