చిత్తూరు జిల్లాలో దారిదోపిడి గ్యాంగ్ అరెస్ట్

-

చిత్తూరు జిల్లాలో దారిదోపిడికి పాల్పడుతున్న గ్యాంగ్ ని అరెస్ట్ చేశారు చిత్తూరు ఈస్ట్ సర్కిల్ పోలీసులు. కేసిసి కన్స్ట్రక్షన్ కంపెనీ పిఆర్వో జాన్సన్ పై దాడి చేసి 12 లక్షల రూపాయలు నగదు ఆపహరించారు ఈ ముఠా. గంగాధర నెల్లూరు మండలం కాలేపల్లి సమీపంలో చిత్తూరు- తర్చూరు హైవే నిర్మాణం పనులు చేస్తోంది కేసీసీ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఆగస్టు ఒకటో తేదీ కంపెనీ పిఆర్వో జాన్సన్ పై దాడి చేసి 12 లక్షల రూపాయలు దోచుకెళ్ళింది ఈ ముఠా.

వారి ఫిర్యాదుతో ఇవాళ ఉదయం 5 గంటలకు నిందితులను అరెస్టు చేశారు చిత్తూరు ఈస్ట్ సర్కిల్ పోలీసులు. నిందితులు అందరూ చిత్తూరు నగరానికి చెందిన యువకులుగా గుర్తించారు. ముఠా గ్యాంగ్ లీడర్ 19 సంవత్సరాల (మక్కిని భరత్) గతంలోనూ పలు నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. మొత్తం 13 మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 11 లక్షల రూపాయలు నగదు, కారు, రెండు ద్విచక్ర వాహనాలు నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

మరో నలుగురు ముద్దాయిలు పరారైనట్లు వెల్లడించారు పోలీసులు. దారిదోపిడికి ప్రేరేపించిన సూత్రదారి, భరత్ తల్లి తేజస్విని ని కూడ అరెస్ట్ చేశారు పోలీసులు. ముఠా సభ్యులు అందరూ దాదాపు 20 సంవత్సరాల వయసు కలిగిన వారే. విలాసాలు , దురలవాట్లకు అలవాటుపడి దారి దోపిడీలకు పాల్పడ్డారు ఈ ముఠా.

నిందితులు ముఠా నాయకుడు మక్కిని భారత్ తో పాటు కె విక్రం, తేజశ్రీ, యస్ సందీప్, జి పవన్ కుమార్,ఏ చరణ్ రాజ్,ఏ లవ కుమార్,కె పవన్ కుమార్, వీ కృష్ణ లను రిమాండ్ కు తరలించారు పోలీసులు. రూపేష్, సాయి, పరంధామనాయుడు, ధనరాజ్ లు పరారీలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news