ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య రాంచి వేదికగా జరుగుతున్న నాలుగోవ టెస్టులో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో మరో ఘనత సాధించారు. టెస్టుల్లో హిట్మ్యాన్ 4,000 పరుగుల మైలురాయిని అందుకున్నారు. మొత్తం 58 టెస్టుల్లో 4004 పరుగులు కంప్లీట్ చేసుకున్నారు. ఈ క్రమంలో టెస్టుల్లో 4 వేల పరుగులు పూర్తి చేసుకున్న 17వ ఇండియా బ్యాటర్ ఆయన నిలిచారు. కాగా అత్యధిక రన్స్ జాబితాలో సచిన్ టెండూల్కర్ (15,921) అగ్రస్థానంలో, రాహుల్ ద్రవిడ్ (13,265) రెండో స్థానంలో ఉన్నారు.
ఇదిలా ఉంటే….192 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఇండియా.. 3వ రోజు ఆట ముగిసే సమయానికి 40/0 రన్స్ చేసింది. ఈ మ్యాచ్లో టీం ఇండియా విజయం సాధించాలంటే ఇంకా 152 రన్స్ చేయాలి. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(24*), జైస్వాల్(16*) ఉన్నారు.ఇక మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 353 రన్స్ చేయగా.. టీమ్ ఇండియా 307 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.