IPL 16వ సీజన్లో ముంబయి ఇండియన్స్ టీమ్ నుంచి ఎట్టకేలకు అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం రోజున సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ తన తొలి వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్‌ను పెవిలియన్ బాట పట్టించి.. తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతకుముందు రెండు ఓవర్లలోనూ అద్భుతంగా బౌలింగ్ చేసిన ఈ జూనియర్ టెండూల్కర్.. సరైన లైన్, లెంగ్త్‌లో బౌలింగ్ చేసి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. దీంతో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆనందంలో మునిగిపోయాడు. ఈ యువ ఆటగాడిని ప్రశంసలతో ముంచెత్తాడు.
“మూడు సంవత్సరాలుగా అర్జున్ ఈ జట్టులో ఓ భాగంగా ఉన్నాడు. అతను చేయాలనుకుంటున్న విషయంపై తనకు పూర్తి క్లారిటీ ఉంది. అతను తన ప్లాన్స్ విషయంలో క్లారిటీగానే ఉన్నాడు. తన కొత్త బంతిని స్వింగ్ చేయడంతో పాటు డెత్ వద్ద యార్కర్లు వేయడానికి ప్రయత్నిస్తున్నాడు.” అంటూ రోహిత్.. అర్జున్ను కొనియాడాడు.