ప్రిన్స్‌ హ్యారి బుక్‌కు భారీ డిమాండ్‌.. తొలి రోజే 4లక్షల కాపీల విక్రయం

-

బ్రిటన్‌ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్‌ హ్యారీ రాసిన స్వీయ జీవిత చరిత్ర పుస్తకం ‘స్పేర్‌’కు యూకేలో భారీ డిమాండ్‌ వస్తోంది. విడుదలైన తొలి రోజే ఏకంగా 4లక్షల కాపీలు విక్రయమయ్యాయి. యూకే లో ఇప్పటివరకూ అత్యంత వేగంగా అమ్ముడవుతున్న నాన్‌-ఫిక్షన్‌ బుక్‌గా ఇది సరికొత్త ఘనత సాధించింది.

‘స్పేర్‌’ పుస్తకం మంగళవారం నుంచి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఈ బుక్‌ను అధికారికంగా విడుదల చేసేందుకు బ్రిటన్‌ వ్యాప్తంగా ఉన్న పుస్తక దుకాణాలు సోమవారం అర్ధరాత్రి తర్వాత 12 గంటలకు ప్రత్యేకంగా తెరుచుకున్నాయి. అప్పటి నుంచే పుస్తకం కోసం అభమానులు బుక్‌స్టోర్‌ల వద్ద బారులు తీరారు.

హార్డ్‌కాపీతో పాటు ఈ-బుక్‌, ఆడియో ఫార్మాట్‌లలో ఈ పుస్తకం అందుబాటులో ఉంది. ఇవన్నీ కలిపి తొలి రోజే యూకే వ్యాప్తంగా ఏకంగా 4లక్షల కాపీలు విక్రయమయ్యాయి. ఈ పుస్తకం వాస్తవ ధర 28 పౌండ్లుగా ఉండగా.. తొలి రోజు చాలా దుకాణాలు సగం ధరకే విక్రయించాయి. అమెజాన్‌లోనూ 14 పౌండ్లకే అందుబాటులో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news